Operation Sindoor Effect : పెరిగిన కుంకుమ ధరలు
Operation Sindoor Effect : జల్‌పైగురి (Jalpaiguri) వంటి ప్రాంతాల్లో సింధూరం (Sinduram) విక్రయాలు గణనీయంగా పెరిగినట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు
- Author : Sudheer
Date : 12-05-2025 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ప్రభావం మార్కెట్లలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జల్‌పైగురి (Jalpaiguri) వంటి ప్రాంతాల్లో సింధూరం (Sinduram) విక్రయాలు గణనీయంగా పెరిగినట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. చాలా కాలంగా స్థిరంగా ఉన్న సింధూర ధరలు ఇప్పుడు 5 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెరిగిందని అంటున్నారు. ముఖ్యంగా పొడి సింధూరానికి డిమాండ్ పెరగడం విశేషమని అంటున్నారు. ఇప్పటివరకు లిక్విడ్ సింధూరమే ఎక్కువగా వినియోగించినా, ప్రస్తుత వాతావరణంలో సంప్రదాయ సింధూరమే మళ్లీ ప్రజల్లో ఆకర్షణ పెరిగింది.
Buddha Jayanti : బుద్ధ జయంతి.. ప్రపంచాన్ని మేల్కొల్పిన బుద్ధుడి బోధనలివీ
సాంప్రదాయానికి తోడు శాస్త్రీయ కారణాల వల్ల సింధూరం ధరించడం ఒక్క ఆచారంగా కాక, ఆరోగ్యపరంగా కూడా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. సింధూరం పెట్టే ప్రదేశం మెదడులోని పిట్యూటరీ గ్రంథి పై ప్రభావం చూపుతూ, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుందని తెలుస్తోంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, వైవాహిక జీవితంపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పబడుతోంది. పైగా సింధూరంలో ఉండే కొన్ని పదార్థాలు మహిళల ఆరోగ్యానికి కూడా దోహదపడతాయని పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కేవలం శాస్త్రీయంగానేకాక, మానసికంగానూ పెద్ద ఊరటగా మారుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజు సింధూరం ధరించడం ద్వారా మహిళ తన వైవాహిక బంధాన్ని గుర్తు చేసుకుంటూ, కుటుంబ జీవితంపై ఓ ధృఢతను ఏర్పరచుకుంటుందని చెబుతున్నారు. సింధూరానికి రామాయణం, మహాభారతం వంటి గ్రంథాల్లోనూ ప్రాధాన్యం ఇవ్వబడినందున, ఇది ఒక సంప్రదాయమే కాదు, మహిళల మనోభావాలను, జీవనశైలిని ప్రతిబింబించే పవిత్ర ఆచారంగా కొనసాగుతోంది. ఓవరాల్ గా ఆపరేషన్ సిందూర్ కారణంగా చాలామందికి సింధూరం యొక్క గొప్పతనం , విలువ అనేది తెలియడం , చాలామంది తెలుసుకోవడం , వాటిని ఉపయోగించడం చేస్తున్నారు.