Cylinder Price : వినియోగదారులకు గ్యాస్ మంట…నేటి నుంచి పెరిగిన సిలిండర్ ధరలు…!!
దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థికపరిస్థితుల కారణంగా ప్రధాన వస్తువలపై ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజీల్ ధరలతోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి.
- Author : hashtagu
Date : 28-06-2022 - 8:47 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థికపరిస్థితుల కారణంగా ప్రధాన వస్తువలపై ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజీల్ ధరలతోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి. కొత్త కనెక్షన్ తీసుకోవాలనకునేవారికి భారీ షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. . ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలిండర్ మరింత ఖరీదుగా మారింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ ను పెంచిన తర్వాత…చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ కనెక్షన్ల రేట్ల పెంచాయి. ఈ మధ్యే ప్రకటించిన ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెంపు ఇవాళ జూన్ 28 2022 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త రేట్ల ప్రకారం..ఇఫ్పుడు వినియోగదారులు 19కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై రూ. 1050 అదనంగా చెల్లించాలి. 19కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 2550 నుంచి 3600కి పెంచాయి చమురు కంపెనీలు.
47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెరిగింది. ఇఫ్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు 7350 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తరేట్ల ప్రకటనకు ముందు 6,450 గా ఉంది. ఇందులో ఒక్కో సిలిండర్ పై 900పెరిగింది. 19కేజీల సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ 4800 నుంచి 5850కి పెంచారు. అదేవిధంగా 47.5కిలోల వాల్వ్ లాట్ వాల్వ్ పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 8,700నుంచి 9,600కి పెంచారు. ఈ పెంపు సామాన్యులకు పెద్దషాకే అని చెప్పవచ్చు.