Gautam : గంభీర్ కు ప్రాణహాని.. ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం!
గౌతమ్ గంభీర్ తన బ్యాటింగ్ శైలితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పాక ఆయన రాజకీయాలకు పరిమితమయ్యారు. ఏ విషయానైనా ముక్కుసూటిగా సమాధానమివ్వడం గంభీర్ ప్రత్యేకత.
- By Balu J Published Date - 12:10 PM, Wed - 24 November 21

ఢిల్లీలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని బీజేపీ పార్లమెంటు సభ్యుడు గౌతమ్ గంభీర్‌ను, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరింపు ఇమెయిల్ రావడంతో ఢిల్లీ పోలీసులు బుధవారం ఉదయం ఆయన ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. “ఐసిస్ కాశ్మీర్” నుంచి తనకు బెదిరింపు మెయిల్ వచ్చిందని, బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించానని మాజీ క్రికెటర్ పోలీసులకు చెప్పాడని కొంతమంది వ్యక్తులు తెలిపారు. గంభీర్ ఇంటి బయట భద్రతను పెంచామని, ఆరోపించిన హత్య బెదిరింపుపై దర్యాప్తు ప్రారంభించామని ఒక పోలీసు అధికారి ధృవీకరించారు.
డిప్యూటీ పోలీసు కమిషనర్ (సెంట్రల్) శ్వేతా చౌహాన్‌కు రాసిన లేఖలో, “ఐసిస్ కాశ్మీర్” అనే గ్రూప్ నుంచి తనకు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని, “మేము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చంపబోతున్నాము” అని రాసి ఉందని ఎంపీ చెప్పారు. తనకు పటిష్ట భద్రత కల్పించడమే కాకుండా ఈ విషయంపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ అందుబాటులో లేరు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ.. ‘పెద్దన్న’గా సంభోదించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సిద్దూ వాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ వివాదంపై స్పందించిన.. భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. సిద్దూపై తీవ్ర విమర్శలు చేశాడు. నీ కూతురు, కుమారుడిని సరిహద్దులకు పంపు.. ఆతరువాత మాట్లాడు అని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం చర్చనీయాంశమైంది.
Related News

BRS vs BJP : కేసీఆర్‌పై మోడీ వ్యాఖ్యలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్.. “నీ బోడి సహాయం మాకు ఎందుకు” అంటూ ఘాటు వ్యాఖ్యలు
నిజామాబాద్ సభలో సీఎం కేసిఆర్ పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని మంత్రి వేముల