Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్‌లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా
సకీనా(Sakina Itoo) తండ్రి వలీ మహ్మద్ ఈటూ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒకప్పుడు అగ్రనేతగా వెలుగొందారు.
- By Pasha Published Date - 04:44 PM, Wed - 16 October 24

Sakina Itoo : సకీనా ఈటూ.. ఈమె పేరు ఇప్పుడు కశ్మీరులో మార్మోగుతోంది. అంతటా ఆమె సాహసోపేత రాజకీయ ప్రస్థానంపై చర్చ జరుగుతోంది. జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల సకీనా ఈటూ పేరు వెలుగులోకి వచ్చింది. తన మంత్రివర్గంలో ఆమెకు ఒమర్ అబ్దుల్లా చోటు కల్పించారు. జమ్మూకశ్మీర్ మంత్రిగా పనిచేసే కీలక అవకాశాన్ని సకీనా సొంతం చేసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగా ఆమెకు మంచి ఛాన్స్ లభించింది.
Also Read :Bomb Threats : మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఏం చేశారంటే.. ?
సకీనా ఈటూ ఎవరు ?
- మొదటి నుంచీ సకీనా ఈటూ కుటుంబం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలోనే ఉంది.
- సకీనా(Sakina Itoo) తండ్రి వలీ మహ్మద్ ఈటూ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఒకప్పుడు అగ్రనేతగా వెలుగొందారు. ఆయన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గానూ సేవలందించారు. అయితే 1994లో ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురయ్యారు.
- వలీ మహ్మద్ హత్య తర్వాత ఆయన కుమారుడు (సకీనా సోదరుడు) రాజకీయాల్లోకి వచ్చాడు.
- సకీనా సోదరుడిని 2001లో ఉగ్రవాదులు హత్య చేశారు. ఆ టైంలో సకీనా ఎంబీబీఎస్ కోర్సు చేస్తోంది.
- తండ్రి, సోదరుడి మరణాల తర్వాత సకీనా చాలా సాహసం చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు.
- సకీనాపై కూడా ఉగ్రవాదులు దాదాపు 20 సార్లు హత్యాయత్నాలకు పాల్పడ్డారు.
- గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టైంలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా సకీనా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
- గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉన్న టైంలో పర్యాటక శాఖ, విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
- 2008 నుంచి 2014 వరకు సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా సకీనా వ్యవహరించారు.
- సకీనా ఈటూ దక్షిణ కశ్మీర్ ప్రాంతంలోని కుల్గామ్ జిల్లా డీహెజ్ పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోకి వచ్చారు.
- పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అభ్యర్థి గుల్జార్ అహ్మద్ దర్‌పై 17,449 ఓట్ల మెజార్టీతో సకీనా గెలిచారు.
- ప్రస్తుతం సకీనా ఈటూ వయసు 53 ఏళ్లు. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి కోసం ఆమె దగ్గర మంచి విజన్ ఉంది. అందుకే మంత్రిగా ఒమర్ అబ్దుల్లా అవకాశం కల్పించారు.