RSS Hedgewar : ఏప్రిల్ 1న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవర్ జయంతి.. జీవిత విశేషాలివీ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విస్తరణ కోసం ప్రచారక్ వ్యవస్థను హెడ్గేవర్(RSS Hedgewar) ఏర్పాటు చేశారు.
- By Pasha Published Date - 09:26 AM, Sat - 29 March 25

RSS Hedgewar : డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవర్.. బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు పురుడు పోసిన దార్శనికుడు. ఏప్రిల్ 1న ఈయన జయంతి దినోత్సవం ఉంది. దీన్ని పురస్కరించుకొని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 30న మహారాష్ట్రలోని నాగపూర్‌లో పర్యటించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవర్ స్మారకాన్ని ఆయన సందర్శిస్తారు. ఈసందర్భంగా హెడ్గేవర్ జీవితంలోని కీలక ఘట్టాల గురించి తెలుసుకుందాం..
Also Read :Allu Arjun 22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 22 ఏళ్ల సినీ జర్నీపై ఓ లుక్
హెడ్గేవర్ ప్రస్థానం ఇలా..
- 1889 ఏప్రిల్ 1న (ఉగాది పండుగ రోజున) మహారాష్ట్రలోని నాగపూర్‌లో బలిరాం పంత్ హెడ్గేవర్, రేవతి బాయ్ దంపతులకు కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవర్ జన్మించారు.
- కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవర్ పూర్వీకులది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామం.
- బ్రిటీష్ వారి విభజించు, పాలించు విధానాన్ని కేశవరావు హెడ్గేవర్ వ్యతిరేకించారు.
- విక్టోరియా మహారాణి జయంతి సందర్భంగా పంచిన మిఠాయిలను విసిరేసి స్వాభిమానం చాటారు.
- కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవర్ తొలుత కాంగ్రెస్ పార్టీలోనే సభ్యుడిగా ఉండేవారు.
- ఆయన అనేక బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈ పోరాటాల క్రమంలో అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు.
- 1921లో భారతీయ ముస్లింల ఖిలాఫత్ ఆందోళనకు మహాత్మాగాంధీ మద్దతు ప్రకటించారు. ఈవిషయం హెడ్గేవర్‌కు నచ్చలేదు. దీంతో ఆయన సొంతబాట పట్టారు.
- దేశంలోని హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు 1925 విజయదశమి రోజున కేవలం ఐదుగురు సభ్యులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు డాక్టర్ హెడ్గేవర్ పురుడు పోశారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది.
Also Read :Seethakka Husband : మంత్రి సీతక్క భర్త గురించి ఈ విషయాలు తెలుసా..
- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విస్తరణ కోసం ప్రచారక్ వ్యవస్థను హెడ్గేవర్(RSS Hedgewar) ఏర్పాటు చేశారు.
- ఒక సందర్భంలో ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మాగాంధీ సందర్శించి, అందులోని స్వయంసేవకులను మీరు ఏ కులానికి చెందినవారు అని ప్రశ్నించారు. దీంతో మేమంతా హిందువులం అని స్వయం సేవకులు సమాధానం చెప్పారు.
- మరొక సందర్భంలో డాక్టర్ అంబేడ్కర్ ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించారు. అక్కడ కులాల కుంపటి లేకుండా సామాజిక సమరసత వెల్లివిరియడం చాలా ఆనందంగా ఉందని అంబేడ్కర్ హర్షం వ్యక్తం చేశారు.
- మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం కాశ్మీర్ కోసం, అయోధ్య రామ మందిరం కోసం ఆర్ఎస్ఎస్ అనేక ఉద్యమాలు చేసింది. ఎంతోమంది స్వయం సేవకులు, కర సేవకులు ప్రాణత్యాగాలు చేశారు.
- అటల్ బిహారీ వాజ్‌పాయి, లాల్ క్రిష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ లాంటి కీలక నేతలను సంఘ్ తయారు చేసింది.
- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 60కిపైగా దేశాలలో పనిచేస్తోంది.
- ఆర్ఎస్ఎస్‌కు అనుబంధంగా ధార్మిక కార్యక్రమాల కోసం విశ్వహిందూ పరిషత్ పనిచేస్తోంది.