Reliance Cool Drinks : రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్.. లంక కూల్‌డ్రింక్స్ విక్రయించనున్న రిలయన్స్
Reliance Cool Drinks : రిలయన్స్ వ్యాపారం వేగంగా విదేశాలకూ వ్యాపిస్తోంది.
- By Pasha Published Date - 08:20 PM, Wed - 28 February 24

Reliance Cool Drinks : రిలయన్స్ వ్యాపారం వేగంగా విదేశాలకూ వ్యాపిస్తోంది. సమ్మర్ సీజన్ నేపథ్యంలో కూల్ డ్రింక్స్ వ్యాపారం విస్తరణపై ఫోకస్ చేస్తున్న రిలయన్స్ కీలక ముందడుగు వేసింది. శ్రీలంకకు చెందిన ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్‌కు చెందిన కూల్‌డ్రింక్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. వాటి ద్వారా కోకా కోలా, పెప్సీలకు పోటీ ఇవ్వాలని రిలయన్స్ భావిస్తోంది. ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద కూల్ డ్రింక్స్, మార్కెటింగ్, సరఫరా, రిటైల్ వ్యాపారం చేసేందుకు సంబంధించి ఆ కంపెనీతో రిలయన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join
ఈ నిర్ణయంతో రిలయన్స్ రిటైల్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించనుంది. కొత్త ఉత్పత్తులు దాని ఖాతాలో చేరనున్నాయి. ఈ పరిణామం దాని వినియోగదారులకు మరింత లాభకరంగా ఉంటుంది. ఇప్పటికే రిలయన్స్ కంపెనీ కాంపా కోలా, సోస్యో బ్రాండ్లతో కూల్ డ్రింక్స్‌ను(Reliance Cool Drinks) విడుదల చేసింది. ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై మరింత దృష్టి సారించాలని భావించిన రిలయన్స్.. ఇప్పుడు కొత్త బ్రాండ్లను పరిచయం చేసే పనిలో నిమగ్నమైంది. ఇదివరకు రిలయన్స్ లోటస్ చాక్లెట్స్, శ్రీలంకకు చెందిన మాలిబన్ బిస్కెట్లను కూడా కొనుగోలు చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ డీల్
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య డీల్ కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకానుంది. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా ఉంటారు.
Also Read : Pawan Kalyan : సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం – పవన్ కళ్యాణ్