Edible Oil Price : సామాన్యులకు గుడ్ న్యూస్..నూనె ధరలు భారీగా తగ్గింపు?
Edible Oil Price : క్రూడ్ పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ మోదీ సర్కార్ మే 31న నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 04:05 PM, Sun - 8 June 25

కేంద్ర ప్రభుత్వం వంట నూనెల ధరల(Edible Oil Price)పై సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే కీలక ప్రకటనను చేసింది. క్రూడ్ పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ మోదీ సర్కార్ మే 31న నిర్ణయం తీసుకుంది. దీని వల్ల దేశీయంగా వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆయిల్ కంపెనీలు ఈ లాభాలను వినియోగదారులకు అందించకపోవడంపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది. వెంటనే ధరలు తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Ananya: ఆనంద క్షణాల్లో అనన్య.. బికినీ షోతో హీట్ పెంచుతూ..
ప్రతి వారం బ్రాండ్ వారీగా మార్కెట్లో అమ్ముతున్న వంట నూనెల మాక్సిమమ్ రిటైల్ ప్రైస్ (MRP) వివరాలను వినియోగదారుల వ్యవహారాల విభాగానికి తెలియజేయాలని కూడా కంపెనీలను ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో కస్టమ్స్ డ్యూటీ తగ్గింపును గౌరవించి తక్షణమే ధరలను తగ్గించాలనే నిబంధనలను కేంద్రం ముందుంచింది. ఇది వినియోగదారులకు మంచి వార్తగా మారింది. ఇప్పటికే ఎస్ఈఏ (సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్) ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. తమ సభ్యులనూ ధరలు తగ్గించాలని సూచించినట్లు తెలిపింది.
Photo Shoot : అందాల ఆరబోతకు బోర్డర్ దాటేసి బ్యూటీ
ఇక పరిశ్రమ వర్గాలు మరో కీలక అభ్యర్థనను ప్రభుత్వానికి పంపాయి. క్రూడ్ ఆయిల్స్ మరియు రిఫైన్డ్ ఆయిల్స్ మధ్య ఉన్న కస్టమ్స్ డ్యూటీ వ్యత్యాసాన్ని పెంచాలని కోరాయి. దీని వల్ల దేశీయ రిఫైనర్లు చౌకగా దిగుమతి అయ్యే రిఫైన్డ్ ఆయిల్స్‌తో పోటీ పడేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వంట నూనె ధరలపై ప్రభావం చూపే ఈ మార్పులపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఇప్పుడు దేశమంతటా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.