HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Recruitment Of 4600 Si And Constable Posts In Rpf

4600 RPF Jobs : 4660 రైల్వే పోలీస్ జాబ్స్.. టెన్త్ అర్హతతోనే అవకాశం

4600 RPF Jobs : రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ (ఆర్​పీఎఫ్​)లో 4660 పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) ప్రకటన విడుదల చేసింది.

  • Author : Pasha Date : 15-04-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
4600 Rpf Jobs
4600 Rpf Jobs

4600 RPF Jobs : రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​ (ఆర్​పీఎఫ్​)లో 4660 పోస్టుల భర్తీకి  రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) ప్రకటన విడుదల చేసింది. వీటిలో ఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్ పోస్టులు ​ 4208(4600 RPF Jobs), ఆర్​పీఎఫ్ ఎస్​ఐ పోస్టులు  452 ఉన్నాయి. సబ్​-ఇన్​స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీరి వయసు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. వీరి వయసు 18  నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సై జాబ్‌కు ఎంపికైతే నెలకు రూ.35,400 జీతం ఇస్తారు. కానిస్టేబుల్ జాబ్‌కు ఎంపికైతే నెలకు రూ.21,700 శాలరీ ఇస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు,  ఎక్స్ సర్వీస్​మెన్​, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ.250. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల పాటు వయోపరిమితిలో మినహాయింపును కల్పిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ఇవాళే (ఏప్రిల్ 15నే) మొదలైంది. మే 14 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఎంపిక ప్రక్రియ ఇదీ.. 

  • అభ్యర్థులకు తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • దీనిలో పాసైన వారికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్​ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తారు.
  • ఎస్​ఐ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకెన్లలో, స్త్రీ అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పూర్తి చేయాలి. పురుష అభ్యర్థులు 12 అడుగల లాంగ్​ జెంప్​, 3 అడుగుల 9 ఇంచీలు హై జెంప్ చేయాలి. స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్​ జెంప్​, 3 అడుగుల హై జెంప్ చేయాలి.
  • కానిస్టేబుల్ పురుష అభ్యర్థులు రన్నింగ్ టెస్ట్​లో 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 45 సెకెన్లలో, స్త్రీ అభ్యర్థులు 800 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 40 సెకెన్లలో పూర్తి చేయాలి. పురుష అభ్యర్థులు 14 అడుగుల లాంగ్​ జెంప్​, 4 అడుగుల 9 ఇంచీలు హై జెంప్ చేయాలి.
    స్త్రీ అభ్యర్థులు 9 అడుగల లాంగ్​ జెంప్​, 3 అడుగుల హై జెంప్ చేయాలి.
  • వీటిలో క్వాలిఫై అయ్యే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • అనంతరం అభ్యర్థుల  డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి అర్హులైన వారిని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

Also Read : Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే

అర్హులైన అభ్యర్థులు https://rpf.indianrailways.gov.in/RPF/  వెబ్​సైట్​లో పేరు, ఫోన్​ నంబర్​, ఈ-మెయిల్​ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో ఒక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతాయి. వీటితో వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి. అప్లికేషన్ ఫామ్​లో వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి.  ఫొటో, సిగ్నేచర్​ సహా అవసరమైన సర్టిఫికెట్స్​ అన్నీ అప్‌లోడ్ చేయాలి.

Also Read :Sai Pallavi : సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు తీసుకుంటుందా..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4600 RPF Jobs
  • Constable Posts
  • jobs
  • Railway Jobs
  • SI posts

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Big shock for railway passengers... Screenshots of train tickets will not be accepted!

    Indian Railways Recruitment: రైల్వేలో 4 వేల పోస్టుల భర్తీకి ఆమోదం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd