Arun Yogiraj : తొలిసారి మాట్లాడిన రామయ్య విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ .. ఏమన్నారు?
Arun Yogiraj : అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన భగవాన్ శ్రీరాముడి ప్రతిమను మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
- By Pasha Published Date - 12:33 PM, Mon - 22 January 24

Arun Yogiraj : అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన భగవాన్ శ్రీరాముడి ప్రతిమను మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. సోమవారం అయోధ్యలో జరుగుతున్న రాముడి ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు భూమిపైన అత్యంత అదృష్టవంతుడైన వ్యక్తిని నేేనే’’ అని శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) చెప్పారు. ‘‘నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, భగవంతుడు రామ్ లల్లా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉంది. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నానేమో అనిపిస్తోంది’’ అని యోగిరాజ్ తెలిపారు. 51 అంగుళాల ఎత్తైన బాలరాముడి విగ్రహాన్ని ఎంతో భక్తిభావంతో తాను తయారు చేశానని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
అరుణ్ యోగిరాజ్ ఎవరు?
- కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ కుటుంబమంతా ప్రఖ్యాత శిల్పులు ఉన్నారు. గత ఐదు తరాలుగా వీళ్ల ఫ్యామిలీ శిల్పాలు చెక్కే పనిలోనే ఉంది.
- యోగిరాజ్ చిన్న వయస్సులోనే శిల్పకళా ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు,
- మైసూర్ రాజు ఆస్థానంలో శిల్పిగా వ్యవహరించిన తన తండ్రి యోగిరాజ్, తాత బసవన్న ద్వారా అరుణ్ యోగిరాజ్ బాగా ప్రభావితమయ్యాడు.
- అరుణ్ యోగిరాజ్ తొలుత ఎంబీఏ చేశాడు. కార్పొరేట్ రంగంలో జాబ్స్ చేశాడు. అయినా యోగిరాజ్‌కు శిల్పకళపై ఉన్న సహజమైన అభిరుచి తగ్గలేదు.
- దీంతో 2008లో అతడు మళ్లీ శిల్పాలు చెక్కే పనిని మొదలుపెట్టాడు. ఈక్రమంలో ఇప్పటివరకు ఎన్నో ఐకానిక్ శిల్పాలను చెక్కాడు.
- 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహం, న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి ఇతడే చెక్కాడు.
Also Read: 47 Buried : 47 మంది సజీవ సమాధి.. మంచుచరియల బీభత్సం
పాత బాల రాముడి విగ్రహాన్ని ఏం చేస్తారు ?
ఇక అయోధ్యలో ఇన్నాళ్లూ పాత మందిరంలో ఉన్న పాత బాల రాముడి విగ్రహాన్ని ఏం చేస్తారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పందించింది. సోమవారం గర్భగుడిలో కొత్తగా ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పాత విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పాత విగ్రహం దాదాపు 6 అంగుళాల ఎత్తు ఉందని.. అది 30 అడుగుల దూరం ఉన్నవారికి కూడా కనిపించదు అని అందుకే కొత్త విగ్రహం అవసరమైందని తెలిపారు. కాగా, దాదాపు 1800 కోట్లతో రామమందిరాన్ని నిర్మించారు.