Rahul Speech : రాహుల్ స్పీచ్.. BJP సెటైర్
Rahul Speech : వాహనాల భద్రత, వాటి బరువు మరియు డిజైన్‌పై మాట్లాడిన ఆయన, “ఒక్కరు వెళ్లే కారు బరువు 3000 కిలోలుంటుంది, ఇద్దరు వెళ్లే బైక్ 100 కిలోలే ఎందుకంటే?” అని ప్రశ్నించారు
- By Sudheer Published Date - 10:45 AM, Sat - 4 October 25

కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులతో లోప(LoP) రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రసంగం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాహనాల భద్రత, వాటి బరువు మరియు డిజైన్‌పై మాట్లాడిన ఆయన, “ఒక్కరు వెళ్లే కారు బరువు 3000 కిలోలుంటుంది, ఇద్దరు వెళ్లే బైక్ 100 కిలోలే ఎందుకంటే?” అని ప్రశ్నించారు. వాహనాల భద్రత దృష్ట్యా ఎక్కువ మెటల్ వాడటం వల్ల కార్ల బరువు ఎక్కువవుతుందని రాహుల్ విద్యార్థులకు వివరించారు.
Blood Sugar: భోజనం చేసిన వెంటనే ఈ విధంగా చేస్తే చాలు షుగర్ కంట్రోల్ అవ్వడం కాయం!
రాహుల్ గాంధీ (Rahul) ఈ సందర్భంగా వాహనాల డిజైన్‌లో ఉన్న సాంకేతిక సమస్యల గురించి మాట్లాడుతూ, ప్రమాదం జరిగితే ఇంజిన్ కారు లోపలికి వచ్చి ప్రయాణికులు గాయపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అందుకే ఎక్కువ మెటల్ వాడటం ద్వారా ఈ సమస్యను తగ్గించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. అదే సమయంలో చిన్న ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు సాంకేతిక కోణంలో ఆసక్తికరంగా ఉన్నా, కొంతమందికి అర్థం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ వ్యాఖ్యలపై BJP నేత అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించారు. “రాహుల్ గాంధీ ఏమి చెప్పారో ఎవరికైనా అర్థమైతే చెప్పండి” అంటూ సెటైర్ వేశారు. రాహుల్ ప్రసంగం సాంకేతికంగా సరైనదా కాదా అన్నది పక్కనబెడితే, ఆయన వాహన భద్రతపై లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం చర్చకు దారి తీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ, నెటిజన్ల మధ్య చర్చనీయాంశమవుతున్నాయి.