Rahul Security : రాహుల్ 113 సార్లు మార్గదర్శకాల ఉల్లంఘన! భద్రతపై హైరానా!
జోడో యాత్రలోని రాహుల్ భద్రత (Rahul Security) ప్రశ్నార్థం అయింది.
- Author : CS Rao
Date : 29-12-2022 - 2:59 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ జోడో యాత్రలోని రాహుల్ భద్రత (Rahul Security) ప్రశ్నార్థం అయింది. ఆయన మార్గదర్శకాలను పాటించడంలేదని భద్రతా ఉద్యోగులు చెబుతున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంలో అధికారులు(Officials) ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ర ఆరోపిస్తోంది. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు కాంగ్రెస్, భద్రతా సిబ్బంది మధ్య నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. పైగా భద్రతను రాహుల్ (Rahul Security)కు పెంచాలని కోరుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం గమనార్హం.
జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Security)
జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ. ఆయన కు ప్రొటోకాల్ ఉంటుంది. ఆ మార్గదర్శకాలను పాటించాలి. కానీ, గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 113 సార్లు ప్రొటోకాల్ ను ఉల్లంఘించారని కేంద్రం తేల్చింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన సున్నితంగా ఉండే పంజాబ్, డిల్లీ ప్రాంతాల్లోకి అడుగు పెట్టారు. ఆ సందర్భంగా భద్రత గురించి అధికారులు సమీక్షించారు. ఆయన స్వయంగా భద్రతా ప్రోటోకాల్‌లను “ఉల్లంఘించాడని” ప్రభుత్వ అధికారులు(Officials) గుర్తించారు.
Also Read : Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు..!
ఢిల్లీ నగరంలో యాత్ర కొనసాగుతోంది. ఆ సందర్భంగా పలు చోట్ల భద్రతా ఉల్లంఘనలు జరిగాయని గుర్తించిన కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. రాహుల్ తో పాటు జోడో యాత్రలో పాల్గొనే ప్రముఖులకు భద్రతను కల్పించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసింది. భద్రతాలోపాలను ఎత్తిచూపుతూ ఆ లేఖలో పొందుపరిచారు. లేఖలోని ఆరోపణలను తోసిపుచ్చిన అధికారులు, రాహుల్ నిర్దేశించిన భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి లేడని నిర్థారిస్తున్నారు.
పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు గమనించామని, ఈ విషయాన్ని ఆయనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణగా 2020 నుండి, 113 ఉల్లంఘనలు రాహుల్ ద్వారా జరిగాయని అధికారులు తెలిపారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీ సరిహద్దులోకి ప్రవేశించిన సందర్భంగా రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను “ఉల్లంఘించారు. Z-ప్లస్ కేటగిరీ భద్రత తో పాటు అతని అంతర్గత వలయాన్ని అందించే CRPF ఆ విషయాన్ని విడిగా తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు
దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలను కోల్పోయారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ షాకు రాసిన లేఖలో ‘ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదని’ అన్నారు. కాంగ్రెస్ నాయకుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో పొందుపరిచారు. యాత్రా శిబిరంలోకి అక్రమంగా ప్రవేశించిన కొందర్ని ఉదహరించారు. యాత్రలో పాల్గొన్న వ్యక్తులను హర్యానా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ సిబ్బంది విచారించారని వేణుగోపాల్ ఆరోపించారు.”శనివారం ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత భద్రత అనేక సందర్భాల్లో సరిగా లేదని మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు “జెడ్+ సెక్యూరిటీ” కలిగి ఉన్న రాహుల్ గాంధీ చుట్టూ వలయాన్ని నిర్వహించడంలో విఫలం అయ్యారు. జనం రద్దీని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని వేణుగోపాల్ ఆరోపించారు.
ఢిల్లీ పోలీసులు ప్రేక్షకులుగా
రాహుల్ గాంధీతో నడిచే కాంగ్రెస్ కార్యకర్తలు, జోడో యాత్రికులు భద్రతా పరిధులను దాటుతున్నారు. వాటిని నియంత్రించేలా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఢిల్లీ పోలీసులు ప్రేక్షకులుగా మిగిలిపోయారని లేఖలో పేర్కొన్నారు. సున్నితమైన పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లలోకి యాత్ర ప్రవేశించనున్నందున భద్రతను మెరుగుపరచాలని వేణుగోపాల్ కోరారు. ఢిల్లీలో తొమ్మిది రోజుల విరామం తీసుకున్న తర్వాత కన్యాకుమారి నుండి కాశ్మీర్ యాత్ర జనవరి 3, 2023న తిరిగి ప్రారంభమవుతుంది. అప్పటికి భద్రతా ఏర్పాట్లను మరింత మెరుగుపరచాలని కాంగ్రెస్ కోరుతోంది.
Also Read : Rahul Gandhi: పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి అమ్మాయి అయితే ఓకే..!