ED : నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు ఈడీ ముందు హజరుకానున్న రాహుల్ గాంధీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) ఈడీ అధికారుల ముందు హజరుకానున్నారు. రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- By Vara Prasad Updated On - 09:21 AM, Mon - 13 June 22

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) ఈడీ అధికారుల ముందు హజరుకానున్నారు. రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సంస్థ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన నివాసం వెలుపల పోలీసులు నిర్బంధించారు.
కరోనా తో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూన్ 23న ఈడీ ముందు ముందు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్-అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ డీల్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జూన్ 1న గాంధీజీకి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని మొదట జూన్ 2న హాజరుకావాలని కోరారు.. అయితే అతను విదేశాల్లో ఉన్నానని..హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరాడు. సోనియా గాంధీ ఢిల్లీలోనే ఉన్నప్పటికి ఆమె కోవిడ్‌తో బాధపడుతున్నందున కొంత సమయాన్ని కోరారు.
దేశ రాజధానిలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు పోలీసులు ఆపుతున్నారని కాంగ్రెస్ నాయకుడు షామా మొహమ్మద్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పై బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. లక్నోలో సచిన్ పైలట్, రాయ్‌పూర్‌లో వివేక్ తంఖా, భోపాల్‌లో దిగ్విజయ్ సింగ్, సిమ్లాలో సంజయ్ నిరుపమ్, చండీగఢ్‌లో రంజీత్ రంజన్, అహ్మదాబాద్‌లో పవన్ ఖేరా, అల్కా లాంబా వంటి కాంగ్రెస్ నేతలు అధినేతకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీకి మద్దతుగా ఢిల్లీలోని పలు చోట్ల ‘నేనే రాహుల్ గాంధీ’, ‘డియర్ మోదీ & షా ..రాహుల్ గాంధీ తల వంచరు’ అంటూ పోస్టర్లు వెలిశాయి.
Related News

TRS MP : టీఆర్ఎస్ ఎంపీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ బ్యాంక్ మోసానికి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీలు, దాని డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన రూ.96.21 కోట్ల విలువైన 105 స్థిరాస్తులు, ఇతర ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద