RG to SRK: షారుక్ కి రాహుల్ గాంధీ లేఖ, లెటర్ లో ఏం రాశారంటే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
- Author : Hashtag U
Date : 04-11-2021 - 12:42 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారుక్ కొడుకు ఆర్యన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి విడుదలయ్యారు. ఇదే విషయలంలో ఆర్యన్ తండ్రి షారుఖ్ ఖాన్ కు అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సానుభూతి తెలిపారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు వెనకుండి బీజేపీ కావాలనే ఇదంతా నడిపిస్తుందని దీన్ని కుట్రగా రాహుల్ అభిప్రాయపడ్డారు.ఆర్యన్ ఖాన్ పై డ్రగ్స్ కేసు కొనసాగుతున్న సమయంలో
రాహుల్ గాంధీ షారూఖ్ ఖాన్‌కు లేఖ రాశారు. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆర్యన్ జైలుకెళ్లిన ఆరు రోజుల తర్వాత, అక్టోబర్ 14న రాహుల్ గాంధీ షారూక్ ఖాన్ కు లేఖ రాశారు. ఆ లేఖలో యావత్ దేశం మీ వెంట ఉంది అని షారుక్ కి రాహుల్ తెలిపినట్టు సమాచారం.ప్రజల కోసం మీరు చేసిన మంచి పనిని చూశానని, వారి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మీకు తప్పకుండా ఉంటాయని నమ్ముతున్నానని, ఏ పిల్లలకు కూడా ఇలా జరగకూడదని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారట.
#ShahRukhKhan replying to Karan Johar on what questions he will ask from #RahulGandhi.
Love both of them ❤@iamsrk @RahulGandhi pic.twitter.com/pLZzBKHIoR
— Classic Mojito (@classic_mojito) March 31, 2021