Pune Airport : పూణె ఎయిర్పోర్ట్ పేరు మార్పు: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Pune Airport : ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నిర్ణయించారు. అంతకుముందు పూణే విమానాశ్రయాన్ని లోహ్‌గావ్ విమానాశ్రయం అని పిలిచేవారు.
- By Latha Suma Published Date - 06:28 PM, Mon - 23 September 24

Maharashtra Government: సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పూణె విమానాశ్రయం పేరును మార్చాలని షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా నిర్ణయించారు. అంతకుముందు పూణే విమానాశ్రయాన్ని లోహ్‌గావ్ విమానాశ్రయం అని పిలిచేవారు. కాగా.. పూణేలోని విమానాశ్రయం పేరును మార్చాలనే సూచనను మురళీధర్ మోహోల్ ఇచ్చారు. అతను అక్కడి నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు పెట్టాలని, కొత్త విమానాశ్రయానికి ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరు పెట్టాలని మురళీధర్ తెలిపారు.
Read Also: CM Chandrababu : అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్: సీఎం చంద్రబాబు ప్రకటన
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక రోజు ముందు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. లోహ్గావ్ విమానాశ్రయం పేరును మారుస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను తదుపరి మంత్రివర్గంలో ఉంచుతామని చెప్పారు. రాష్ట్ర కేబినెట్‌లో ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత.. ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపబడుతుందన్నారు. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. ఎయిర్‌పోర్టు పేరు మార్చడానికి ప్రధాని మోడీ నుండి ఆమోదం కోసం ప్రయత్నిస్తానని గడ్కరీ చెప్పారు.