HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Priyanka Gandhi Criticizes Jamili Bill

Jamili Elections : జమిలి బిల్లు పై ప్రియాంకా గాంధీ విమర్శలు

Jamili Elections : జమిలి ఎన్నికలు కేంద్రం దృష్టికి అనుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్రతను తగ్గిస్తాయని అన్నారు

  • Author : Sudheer Date : 17-12-2024 - 4:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyanka Jamili Bill
Priyanka Jamili Bill

జమిలి ఎన్నికల బిల్లు (Jamili ఎలేచ్షన్స్ Bill) దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (MP Priyanka Gandhi) విమర్శించారు. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన ఓటింగ్‌లో అనేక సభ్యులు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. బిల్లు వల్ల సమాఖ్య వ్యవస్థ క్షీణించి, రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులు నష్టపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు కేంద్రం దృష్టికి అనుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్రతను తగ్గిస్తాయని అన్నారు. దేశం విభిన్న రకాల సమస్యలతో సతమతమవుతున్న వేళ, ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని, ప్రజల ఓటు హక్కుపై ప్రభావం చూపుతుందని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని డిమాండ్ చేశారు. బిల్లులో అనేక లోటుపాట్లు, అస్పష్టతలు ఉన్నాయి. విస్తృత చర్చ ద్వారా వాటిని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. బిల్లు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం జరుగుతుందని, జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే అవకాశముందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంకా గాంధీ మాటలతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా బిల్లు ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మొత్తానికి జమిలి ఎన్నికల బిల్లు పట్ల రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం దీన్ని సమయాన్ని ఆదా చేసే పరిష్కారమని చూస్తుంటే, మరో వర్గం దీన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని నమ్ముతోంది. ఈ వివాదంపై కేంద్రం, ప్రతిపక్షాలు మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

Read Also : Allu Arjun : అల్లు అర్జున్ ను నిలదీసిన POW సంధ్య


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arjun Ram Meghwal
  • congress
  • Jamili Bill
  • Jamili Elections
  • Jamili Elections Bill
  • lok sabha
  • Priyanka gandhi

Related News

    Latest News

    • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd