PM Modi : మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీ
PM Modi : ఈసదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోడీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోడీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
- Author : Latha Suma
Date : 18-10-2024 - 2:55 IST
Published By : Hashtagu Telugu Desk
Russia Tour : భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన ఖరారైంది. మాస్కో అధ్యక్షతన వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పాల్గోనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యాలోని కజన్ వేదికగా ఈనెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈసదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోడీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోడీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది.
కాగా, నాలుగు నెలల్లో ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 8 – 9 తేదీల్లో ఆయన రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోలో తొలిసారి పర్యటించారు. 22వ భారత్ – రష్యా వార్సిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.
Read Also: MUDA Scam : ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు