BPSC row : జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
- Author : Latha Suma
Date : 30-12-2024 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
BPSC row : పట్నాలో బీపీఎస్సీ అభ్యర్థులపూ జరిగిన లాఠీఛార్జీని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ నేత ప్రశాత్ కిశోర్ ఖండించారు. పేపర్ లీక్‌పై పోరాడుతున్న యువతపై పోలీసులు అనుసరించిన వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసుల చర్యలకు నిరసనగా జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానని ప్రకటించారు.
కాగా, బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. వీరిపై ఆదివారం పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించి.. లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులపై పోలీసుల చర్యలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. అభ్యర్థుల నిరసనలు, ఆపై పోలీసుల లాఠీఛార్జ్ వంటి ఘటనలతో పాట్నా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఆయనపై కేసు కూడా నమోదు అయినట్టు సమాచారం.
ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి రావాలనే ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో బీహార్‌లో తొలిసారి ‘జన సురాజ్’ పేరిట పార్టీ పెట్టారు. ఆ తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం సత్తా చాట లేకపోయింది. కొద్దిరోజులుగా నితీష్‌కుమార్‌పై రకరకాలుగా ఫైట్ చేస్తున్నా, ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదు.