PK Floating Party: నవంబర్ 12న `పీకే` కొత్త పార్టీ
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నవంబర్ 12వ తేదీన పార్టీని ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తోన్న ఆయన ఈనెల 11వ తేదీన కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొత్త పార్టీ ప్రకటనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రకటించారు.
- By CS Rao Published Date - 03:18 PM, Wed - 2 November 22

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నవంబర్ 12వ తేదీన పార్టీని ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తోన్న ఆయన ఈనెల 11వ తేదీన కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొత్త పార్టీ ప్రకటనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ విషయాన్ని పాదయాత్ర సందర్భంగా ఆయన ప్రకటించారు.
వాస్తవంగా `జన్ సురాజ్` పాదయాత్ర ముగిసిన తరువాత కొత్త పార్టీని ప్రకటించే ఆలోచన చేస్తానని తొలుత ప్రశాంత్ కిషోర్ అనుకున్నారు. కానీ, బీహార్లోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ప్రకటించడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.అక్టోబర్ 2న `జన్ సూరాజ్` పేరుతో పాదయాత్ర ప్రారంభించిన కిషోర్ యాత్ర 31వ రోజుకు చేరుకోవడంతో మంగళవారం 300 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. మొత్తం 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ద్వారా జన్ సురాజ్ కు ముగింపు పలికేలా బ్లూ ప్రింట్ వేసుకున్నారు.
Also Read: Munugode Voters: డబ్బిస్తేనే ఓటు! రోడ్లపై మహిళా ఓటర్లు!!
కొత్త పార్టీని ఈనెల 12వ తేదీన ప్రకటించే అంశంపై పశ్చిమ చంపారన్‌లోని లౌరియా నందన్‌గర్‌లో ఎన్నికల వ్యూహకర్త మీడియాతో మాట్లాడారు. 2024లో నితీష్, లాలూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓటు వేయవద్దని ఓటర్లను ఉద్బోధించారు. ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్ ను టార్గెట్ చేస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మరోసారి నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.