Rahul Gandhi : అధికార ఊహల పల్లకిలో రాహుల్..మళ్లీ బీజేపీదే అధికారమంటోన్న పీకే
`సమీప భవిష్యత్ లోనే అధికారం హస్తగతం అవుతుందని రాహుల్ గాంధీ ఊహల్లో తేలియాడుతున్నాడు. మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ బలమైన శక్తిగా ఉంటుంది.
- By Hashtag U Published Date - 01:52 PM, Thu - 28 October 21

`సమీప భవిష్యత్ లోనే అధికారం హస్తగతం అవుతుందని రాహుల్ గాంధీ ఊహల్లో తేలియాడుతున్నాడు. మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ బలమైన శక్తిగా ఉంటుంది. ప్రధాన మంత్రిగా మోడీ ఉన్నా, లేకున్నా బీజేపీ దేశ రాజకీయాల్లో కీలకంగా ఉంటుంది..“ ఇలా చెప్పింది ఎవరో కాదు..ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్. దేశ వ్యాప్తంగా మూడింట ఒక వంతు ఓటు బ్యాంకు గ్యారెంటీగా బీజేపీకి ఉంటుంది. మిగిలిన మూడింట రెండు వంతుల ఓట్లను 10 నుంచి 15 రాజకీయ పార్టీలు పంచుకుంటున్నాయి. ఫలితంగా కొన్ని దశాబ్దాలపాటు బీజేపీ చేతిలోనే దేశం ఉంటుందని పీకే అంచనా వేస్తున్నాడు.
ప్రస్తుతం గోవా ఎన్నికల వ్యూహాలను టీఎంసీ కోసం ప్రశాంత్ కిషోర్ రచిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతను కూర్చొబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రతిష్టాత్మకంగా ఆ ఎన్నికలను మోడీ, అమిత్ షా ద్వయం తీసుకుంది. రెండంకెలను మించిన సీట్లను బీజేపీ పొందలేదని ముందే చెప్పిన పీకే, ఆ మేరకు కట్టడీ చేయగలిగాడు. భారీ వ్యూహాలను రచించిన పీకే ఆ ఎన్నికల్లో మమతకు అధికారం రావడానికి కేంద్ర బిందువు అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు పీకే టీం 2024 దిశగా వ్యూహాలను రచిస్తున్న విషయం విదితమే.ప్రజానాడిని పసికట్టడంలో అపార అనుభవం ఉన్న పీకే, కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న రాహుల్ ఆలోచనను తప్పుబడుతున్నాడు. మోడీ, బీజేపీ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తుందని రాహుల్ నమ్ముతున్నాడు. సరిగ్గా ఇక్కడే ఆయన తప్పటడుగు వేస్తున్నాడని పీకే భావిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ బలం, బలహీతనలను బేరీజు వేసుకోకుండా బీజేపీపై ఉన్న వ్యతిరేత మీద ఆధారపడడం రాహుల్ చేస్తోన్న మొదటి తప్పుగా పీకే చెబుతున్నాడు. వ్యక్తిగత బలహీనతలు, బలాలను కూడా రాహుల్ అంచనా వేసుకుని రాజకీయాల్లోకి చురుగ్గా వెళ్లాలని సలహా ఇస్తున్నాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వాతంత్ర్య వచ్చిన తొలి 40ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, అలా బీజేపీ ఉందని పీకే అంచనా వేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా 30శాతం ఓట్లను పొందిన ఏ పార్టీని ఈజీగా అధికారం నుంచి తొలగించడానికి అవకాశంలేదు. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఆయిల్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు, ఇతరత్రా తప్పిదాలతో మోడీ, బీజేపీని ప్రజలు విసిరిపారేస్తారని భావించడం తప్పుడు అంచనాలకు సంకేతం మాత్రమే. ఈ అంశాలన్నింటితో ప్రజలు మోడీని పక్కన పెడతారేమోగానీ, బీజేపీని అధికారంలో లేకుండా చేయరని పీకే అధ్యయనం స్పష్టం చేస్తోంది. జాతీయ స్థాయిలో మూడింట ఒక వంతు, మూడింట రెండొంతుల ఓటర్ల మధ్య పోటీ ఉంటుంది. మూడింట్ రెండొంతుల ఓట్లు అంటే 65శాతం సుమారు 10 నుంచి 15 పార్టీలు పంచుకోవడాన్ని గమనిస్తే, మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని గ్రహించవచ్చు.
Related News

Trudeau: భారత్ తో వివాదం మాకు ఇష్టం లేదు.. కెనడా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఖలిస్తానీ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్, కెనడాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudeau) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.