HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pornographic Images On Otts Center Lashes Out At 25 Apps

OTT Apps: ఓటీటీల్లో అశ్లీల చిత్రాలు.. 25 యాప్‌లపై కేంద్రం కొరడా

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుని, మొత్తం 25 యాప్‌లు మరియు వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేదికలు నిరంతరం భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, నియమ నిబంధనలను తృణప్రాయంగా భావిస్తూ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది.

  • By Latha Suma Published Date - 01:44 PM, Fri - 25 July 25
  • daily-hunt
Pornographic images on OTTs.. Center lashes out at 25 apps
Pornographic images on OTTs.. Center lashes out at 25 apps

OTT Apps : దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓటీటీ వేదికల్లో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్‌ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు బహిరంగంగా అశ్లీల చిత్రాలు, వీడియోలు ప్రసారం చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుని, మొత్తం 25 యాప్‌లు మరియు వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వేదికలు నిరంతరం భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ, నియమ నిబంధనలను తృణప్రాయంగా భావిస్తూ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది. ముఖ్యంగా ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్‌, దేశీఫ్లిక్స్‌ వంటి యాప్‌లు పునరావృతంగా వయోజన కంటెంట్‌ను వివాదాస్పదంగా ప్రసారం చేస్తున్నట్లు గుర్తించి వాటిపై కొరడా ఝుళిపించింది.

నిషేధిత యాప్‌లు, వెబ్‌సైట్లు ఇవే:

ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్‌, బిగ్ షాట్స్‌, బూమెక్స్‌, నవరస లైట్‌, గులాబ్ యాప్‌, కంగన్ యాప్‌, బుల్ యాప్‌, జల్వా యాప్‌, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫినియో, షోఎక్స్‌, సోల్ టాక్స్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియాన్‌ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌.
ఈ యాప్‌లు, వెబ్‌సైట్లను భారతదేశంలోని ఇంటర్నెట్‌ సేవలందించే సంస్థలు బ్లాక్‌ చేయాలని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలను పాటించకుండా ఉల్లంఘిస్తే, వారు చట్టపరమైన రక్షణ కోల్పోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది.

డబ్బుల ఎర.. అసభ్యతా వ్యాపారం

కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్లు వీడియోలు చూస్తే డబ్బులే డబ్బులు అనే ఆశ చూపుతూ, వినియోగదారులను ఆకర్షించి వారి డేటా దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌లను ఉపయోగిస్తున్న పెద్ద సంఖ్యలో యువత అసమర్థవైన, అసభ్యకర కంటెంట్‌కు బానిసలవుతుండటం భద్రతపరంగా, మానసిక ఆరోగ్యపరంగా ప్రమాదకరమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

కంటెంట్‌పై బాధ్యత తీసుకోవాలని సూచన

ఓటీటీ సేవలందించే సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారమవుతున్న కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. భారతీయ చట్టాలను ఉల్లంఘించే విధంగా కంటెంట్‌ను ప్రసారం చేస్తే, తగిన చర్యలు తప్పవు అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ చర్యలతో ఓటీటీ రంగంలో బాధ్యతాయుత ప్రసారానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇలాంటి నిషేధాలు వినియోగదారులను కూడా కంటెంట్ ఎంపికలో చురుకుగా మారేలా చేస్తాయని భావిస్తున్నారు.

Read Also: Thailand Cambodia Conflict : కంబోడియా-థాయిలాండ్ మధ్య ఘర్షణలు.. 900 ఏళ్ల పురాతన ఆలయం చుట్టూ మళ్లీ ఉద్రిక్తతలు?

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DesiFlix
  • Illegal Content
  • Ministry of Information and Broadcasting
  • Online Streaming
  • OTT platforms ban
  • Pornographic images
  • Ullu app
  • Ullu app ALT app

Related News

    Latest News

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd