Rajasthan Political Crisis : రాజస్థాన్ కాంగ్రెస్‌లో పొలిటికల్ హైడ్రామా.. స్పీకర్‌కి రాజీనామాలు ఇచ్చేందుకు..?
రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న...
- By Prasad Published Date - 07:34 AM, Mon - 26 September 22

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రస్తుతం సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. రాజస్థాన్ లో తర్వాత సీఎం ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉండాలని చాలామంది ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సచిన్ పైలట్ కు సీఎం పదవి అప్పగిస్తే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. 92 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ బలం 55 కి పడిపోనుంది. బీజేపీకి 70 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు . సచిన్ పైలట్ సీఎం కాకుండా అశోక్ గెహ్లాట్ వర్గం అడ్డుకుంటోంది.