Pooja Khedkars Mother : తుపాకీతో రైతును బెదిరించిన వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్ తల్లి అరెస్ట్
మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేడ్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Pasha Published Date - 12:19 PM, Thu - 18 July 24

Pooja Khedkars Mother : మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేడ్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భూమి వ్యవహారంలో తుపాకీ చూపించి రైతును బెదిరించిన ఘటనకు సంబంధించి మనోరమ(Pooja Khedkars Mother) దంపతులపై కేసు నమోదైంది. ఇవాళ ఉదయం మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉన్న మహద్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
మనోరమ అరెస్టు వివరాలను పూణే రూరల్ పోలీస్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ మీడియాకు వెల్లడించారు. రైతును బెదిరించిన వ్యవహారంలో మనోరమతో పాటు మరో ఆరుగురిపైనా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మహద్‌లో అదుపులోకి తీసుకున్న మనోరమను పూణెకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. పూణేలోని ముల్షి తహసీల్‌లో ఉన్న ధద్వాలీ గ్రామంలో మనోరమా భూవివాదానికి సంబంధించి పొరుగువారితో తీవ్ర వాగ్వాదానికి దిగిందని తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండు నిమిషాల ఫుటేజీ కలిగిన ఈ వీడియోలో తన సెక్యూరిటీ గార్డులతో కలిసి, తుపాకీ చూపిస్తూ ఒక వ్యక్తిపై మనోరమ గట్టిగా అరిచారు. తమ భూమి పక్కనే ఉన్న రైతుల భూములను మనోరమ కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక రైతును బెదిరించేందుకు ఆమె చూపించిన తుపాకీకి లైసెన్స్ ఉందా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Also Read :BMW CE 04: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జూలై 24న ప్రారంభం, ధర రూ. 10 లక్షలు..!
ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఇక దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షకు పూజ వేర్వేరు పేర్లతో హాజరైనట్లు సమాచారం. 2019లో ఖేద్కర్ పూజా దిలీప్‌రావు అనే పేరుతో ప్రిలిమ్స్ రాయగా.. 2022లో పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ పేరుతో హాజరయ్యారని విచారణలో గుర్తించారు. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అటు సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్‌కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును వేర్వేరుగా పేర్కొనడం గమనార్హం.పూజా ఖేద్కర్ వివాదంపై దర్యాప్తునకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ దర్యాప్తు చేస్తోంది.