PM Modi: ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ ఖతార్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ఖతార్ రాజధాని దోహాలో పర్యటిస్తారు. ఖతార్ జైల్లో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందిని గల్ఫ్ దేశం విడుదల చేసిన తరుణంలో మోడీ ఖతార్ పర్యటన ఖరారైంది.
- Author : Praveen Aluthuru
Date : 12-02-2024 - 5:46 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ఖతార్ రాజధాని దోహాలో పర్యటిస్తారు. ఖతార్ జైల్లో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందిని గల్ఫ్ దేశం విడుదల చేసిన తరుణంలో మోడీ ఖతార్ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మాజీ భారత నౌకాదళ సిబ్బందిని గల్ఫ్ దేశం విడుదల చేసిన తరుణంలో వీరిలో ఏడుగురు సోమవారం ఉదయం భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ కేసులో పరిణామాలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.
భారతీయులను విడుదల చేయాలన్న ఖతార్ నిర్ణయంతో మేము సంతోషిస్తున్నామని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు మోదీ, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. గత అక్టోబరులో విధించిన మరణ శిక్షలను 46 రోజుల తర్వాత భారతీయులు తిరిగి సొంత దేశానికి తిరిగి వచ్చారు.
Also Read: Pedicure At Home: రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ చేసుకోండిలా?