PM Modi-353 : 10 రోజులు..353 మంది ఎన్డీఏ ఎంపీలు.. భేటీ కానున్న ప్రధాని మోడీ
PM Modi-353 : ఓ వైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికలు టార్గెట్ గా అధికార నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కసరత్తును ముమ్మరం చేసింది.
- By Pasha Published Date - 07:22 AM, Fri - 21 July 23

PM Modi-353 : ఓ వైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికలు టార్గెట్ గా అధికార నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జులై 25 నుంచి ఆగస్టు 11లోగా ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిరోజూ భేటీ కానున్నారు. పార్లమెంటు సెషన్ ముగిసేలోగా కూటమిలోని మొత్తం 353 మంది ఎంపీలతో(PM Modi-353) ఆయన సమావేశమయ్యేలా ప్లాన్ రెడీ చేశారు. ఇందుకోసం ఎన్డీఏ కూటమిలోని పార్టీల ఎంపీలతో 10 గ్రూపులను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో దేశంలోని రెండు ప్రాంతాలకు చెందిన 35 నుంచి 40 మంది ఎంపీలు ఉండేలా విభజించారు. స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి వ్యూహ రచనతో ముందుకు వెళ్లాలనే దానిపై ఈ మీటింగ్స్ లో చర్చ, అభిప్రాయాల సేకరణ జరుగుతుందని తెలుస్తోంది.
Also read : Earthquakes: మణిపూర్, జైపూర్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!
జూలై 25న జరిగే మొదటి మీటింగ్ లో ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంత ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశమవుతారు. ప్రతిరోజూ ఈ మీటింగ్స్ రెండు భాగాలుగా జరుగుతాయి. మొదటి మీటింగ్ సాయంత్రం 6:30 గంటలకు, రెండో మీటింగ్ రాత్రి 7:30 గంటలకు ఉంటుంది. ఈ మీటింగ్స్ లో ఎంపీలతో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అవుతారు. సంజీవ్ బల్యాన్, అజయ్ భట్ సహా పలువురు కేంద్ర మంత్రులు, కూటమిలోని పార్టీల పలువురు నాయకులు ఈ సమావేశాల సమన్వయ ఇన్‌చార్జ్ లుగా వ్యవహరిస్తారు. బీజేపీ తరఫున జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్, పార్టీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా సమన్వయం చేస్తారు. బీజేపీ ఎంపీలు తమ పని తీరుపై నివేదికలు సిద్ధం చేసుకొని రావాలని ఇప్పటికే సూచనలు వెళ్లాయి.
Also read : Blasts In Pakistan: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, ఎనిమిది మందికి గాయాలు