Modi 3.0 : మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ నేతలు, అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు
- Author : Sudheer
Date : 09-06-2024 - 7:36 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ కు ప్రధానికి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసారు నరేంద్ర మోడీ (Modi). ఢిల్లీ లోని రాజ్‌భవన్ వద్ద మోడీ పట్టాభిషేక వేడుక అట్టహాసంగా జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే , నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవిండ్ కుమార్ జగన్నాథ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. మొత్తం 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలుగు రాష్ట్రాల నుండి టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , నాగబాబు , బండి సంజయ్ , కిషన్ రెడ్డి పలువురు హాజరయ్యారు. ఇక భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దేశ, విదేశీ నేతలు, అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే కాబినెట్ మంత్రిగా రాజ్ నాధ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసారు. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణం మొత్తం మోడీ పేరుతో దద్దరిల్లిపోయింది. 2014లో మోడీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
Read Also : Bellam Sunnundalu : పిల్లలు, మహిళలకు బలాన్నిచ్చే బెల్లం సున్నుండలు.. ఇలా చేస్తే సూపర్ !