Pm Modi: అందుకే విపక్ష ఇండియా కూటమి వాళ్లు నాపై దాడి చేస్తున్నారుః ప్రధాని మోడీ
- By Latha Suma Published Date - 01:31 PM, Sat - 9 March 24

Sela Tunnel Pm Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా- చైనా(India- China) సరిహద్దులోని తూర్పు సెక్టార్(Eastern sector)లో నిర్మించిన సేలా టన్నెల్(Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh) రాజధాని ఈటానగర్(Itanagar)లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
READ ALSO : Attack on Dastagiri Father : దస్తగిరి తండ్రిపై దాడి
“దక్షిణ, తూర్పు ఆసియాతో భారతదేశ వాణిజ్యం, పర్యాటకం, ఇతర సంబంధాల్లో ఈశాన్య రాష్ట్రాలు ఒక బలమైన వారిధిగా మారనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మేము ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ చేయడానికి 20ఏళ్లు పడుతుంది. అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శిస్తే ‘మోడీ గ్యారంటీ’ ఏమిటో స్పష్టంగా చూడవచ్చు. మోడీ ‘గ్యారంటీ’ ఎలా పని చేస్తుందో మొత్తం ఈశాన్య రాష్ట్రాలు గమిస్తున్నాయి. నేను దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను, అందుకే విపక్ష ఇండియా కూటమి నాయకులు నాపై దాడి చేస్తున్నారు” అని ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
#WATCH | Itanagar, Arunachal Pradesh: Prime Minister Narendra Modi says, You must have heard of 'Modi Ki Guarantee'. You will realize its meaning once you reach Arunachal. The entire Northeast is a witness to this. I laid the foundation of the Sela Tunnel here in 2019, and today… pic.twitter.com/tqjnNd2fh6
— ANI (@ANI) March 9, 2024
సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా గుర్తింపు పొందింది. 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
We’re now on WhatsApp. Click to Join.