PM Modi Most Popular: లోక నాయకుడు మన ‘మోడీ’
ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుందా..? ప్రపంచ దేశాలతో కార్యాకలాపాలు కొనసాగించడంతో మోడీ ముందున్నారా..? ప్రపంచ దేశాధినేతలను మోడీ వెనక్కి నెట్టేస్తున్నారా..?
- By Balu J Published Date - 11:34 AM, Mon - 21 March 22

ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుందా..? ప్రపంచ దేశాలతో కార్యాకలాపాలు కొనసాగించడంతో మోడీ ముందున్నారా..? తన ఛరిష్మాతో ప్రపంచ దేశాధినేతలను మోడీ వెనక్కి నెట్టేస్తున్నారా..? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి నేటి సర్వేలు. తాజాగా జరిపిన ఓ సర్వేలో ప్రధాని మోడీ వరల్డ్ పాపులర్ లీడర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇతర దేశాధినేతలను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు. యుఎస్‌కు చెందిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ మార్నింగ్ కన్సల్ట్’ సర్వే చేసిన 13 మంది ప్రపంచ నాయకులలో ప్రధాని నరేంద్ర మోడీ అత్యధిక రేటింగ్ సాధించారు.
మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యుకె కంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ 77 శాతం రేటింగ్ సాధించారు. 2022 మార్చి నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వేలు కొన్ని దేశాల్లో వయస్సు, ప్రాంతం ఆధారంగా జరిగితే, మరికొన్ని దేశాలలో అధికారిక ప్రభుత్వ వనరుల ఆధారంగా, విద్యా విచ్ఛిన్నాల ఆధారంగా లెక్కించబడతాయి. యునైటెడ్ స్టేట్స్‌లో జాతి సంపద ఆధారంగా కూడా పరిగణించబడతాయి.
ఇటీవల ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరోసారి మోడీ ప్రభావాన్ని స్పష్టం చేశాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మోడీ తన నిర్ణయాలతో, ముందుచూపుతో తనదైన ముద్ర వేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకొని నల్లచట్టాలను రద్దు చేసి సక్సెస్ అయ్యారు. మోడీ ఛరిష్మా మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు పాకింది. ఆయన ప్రధానంగా ఇతర ప్రపంచ దేశాలతో మంచి సత్సంబంధాలు కొనసాగించడం, ఆయా దేశాలను పెట్టుబడులకు ఆహ్వానించడం లాంటి అంశాలు మోడీ పాపులారిటీకి కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.