Modi Global Leader: మన మోడీ గ్లోబల్ లీడర్.. పాపులారిటీలో అరుదైన రికార్డ్!
భారత ప్రధాని నరేంద్ర మోడీ 76% ఆమోదంతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు.
- By Balu J Published Date - 04:36 PM, Mon - 3 April 23

ప్రధాని మోడీ నరేంద్ర మోడీ తిరుగులేని ఛరిష్మాతో దూసుకుపోతున్నారు. ఆయనకు మనదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ 76% ఆమోదంతో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా ఎంపికయ్యారు. మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, 61%, 55% రేటింగ్ ఉన్న ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో సహా ఇతర ప్రపంచ నాయకుల కంటే మోడీ ముందున్నాడు.
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనికి 49% ఆమోదం లభించగా, బ్రెజిలియన్ అధ్యక్షుడు లూలా డి సిల్వా ఐదవ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని ఇక యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ 41% శాతంతో ఆరవ స్థానంలో నిలిచారు. PM మోడీ ఆమోదం రేటింగ్ ఫిబ్రవరిలో 78% నుండి కొద్దిగా తగ్గినప్పటికీ, ప్రజాదరణ పరంగా ఇతర ప్రపంచ నాయకుల కంటే ముందుండటం విశేషం. ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ లీడర్‌గా అవతరించడం ఇదే మొదటిసారి కాదు.
బలమైన నాయకత్వ నైపుణ్యాలు, విధానాలు ఆయన్ను టాప్ ప్లేస్ లో కొనసాగేలా దోహదపడుతున్నాయి. ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, డిజిటలైజేషన్ వంటి అంశాలపై భారత ప్రధాని దృష్టి కేంద్రీకరించడం కూడా ప్రజాదరణకు మరింత దోహదపడింది. పిఎం మోడీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడింది. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో వైరస్‌ను ఎదుర్కోవడం, దేశ ప్రజలకు అండగా నిలబడటం లాంటి అంశాలు గుర్తింపు తీసుకొచ్చాయి. టీకా డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.