HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modi Assassination Plot Revealed

PM Modi : ప్ర‌ధాని మోడీ హ‌త్య‌కు బీహార్లో కుట్ర‌

బీహార్లో ప్ర‌ధాన మోడీ హ‌త్య‌కు ఉగ్ర‌వాదులు కుట్ర పన్నారు. ఆ విష‌యాన్ని బీహార్ నిఘా విభాగం తెలుసుకుని ఉగ్ర‌వాదుల వ్యూహాల‌ను ఛేదించారు.

  • Author : CS Rao Date : 14-07-2022 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Security
Modi Security

బీహార్లో ప్ర‌ధాన మోడీ హ‌త్య‌కు ఉగ్ర‌వాదులు కుట్ర పన్నారు. ఆ విష‌యాన్ని బీహార్ నిఘా విభాగం తెలుసుకుని ఉగ్ర‌వాదుల వ్యూహాల‌ను ఛేదించారు. పాట్నాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్న  లక్ష్యంగా ఉగ్ర‌వాదులు ప‌నిచేస్తున్నారు. ప్రధాని మోదీ హ‌త్య‌ను రెండో లక్ష్యంగా  పెట్టుకున్నార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఈనెల 12న ఆయ‌న్ను హ‌త్య చేయాల‌ని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు ప్రాథ‌మికంగా ద‌ర్యాప్తు అనంత‌రం బీహార్ పోలీసులు ప్రకటించారు.

ఉగ్ర‌వాదులు అస్థార్ పర్వేజ్, జలూలుద్దీన్ అనే ఇద్ద‌ర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పాట్నాలోని పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు శిక్షణ పొందినట్టు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి పోలీసులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యం బయటపడింది. తొలుత పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికల సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలిసింది. వెంట‌నే బీహార్ పోలీసులకు, ఎన్ఐఏకు సమాచారం చేర‌వేసింది. రంగంలోకి దిగిన ఎన్ ఐ ఏ , బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించడం ద్వారా ఉగ్రవాదులను పట్టుకొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి యూత్ పుల్వామా షరీఫ్ ప్రాంతానికి వచ్చి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకుంటున్నట్టు గుర్తించడం విశేషం. పెద్ద కుట్ర‌ను ఛేదించ‌డంతో ఉగ్ర‌వాదుల శిక్ష‌ణ వ్య‌వహారం బ‌ట్ట‌బ‌య‌లు అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • pm modi
  • PM Modi security

Related News

Lok Sabha Seats

లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

అప్నా దళ్ (ఎస్) ఎంపీ అనుప్రియా పటేల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఈ మూడు బిల్లులకు తన మద్దతు ప్రకటించారు.

    Latest News

    • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

    • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

    • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

    • Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

    • Delimitation Bill : ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం అంటూ ప్రియాంకా గాంధీ సంబరాలు

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

      • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd