HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Kisan Samman Fund On 24th February

PM Kisan : ఫిబ్రవరి 24న PM కిసాన్ సమ్మాన్ నిధి

గత 18వ విడత, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు

  • Author : Latha Suma Date : 28-01-2025 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Kisan 19th Installment
PM Kisan 19th Installment

PM Kisan: ఫిబ్రవరి 24న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం కింద రైతులకు 19వ విడత డబ్బుల సాయం విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాకు రూ. 2,000 చొప్పున మంజూరు చేస్తారు.

కర్పూరి ఠాకూర్ 101వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయం, రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు. ఇక, గత 18వ విడత, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు.

కాగా, భారత ప్రభుత్వం 2019లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు జమ చేశారు.

Read Also: South Africa: సౌతాఫ్రికా మ‌రో స్టార్ ఆట‌గాడికి గాయం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 19th installment
  • Minister Shivraj Singh Chauhan
  • pm kisan
  • pm modi

Related News

Congress Leader

ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

ఈ వ్యాఖ్యల వెనుక డొనాల్డ్ ట్రంప్ జనవరి 5న చేసిన ప్రకటన ఉంది. రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేయకపోతే భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.

  • PM Kisan Yojana

    పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్‌.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!

Latest News

  • బ్రోకలీ vs కాలీఫ్లవర్‌.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..?

  • మున్సిపల్ ఎన్నికలపై ఈసీ సన్నాహాలు..16 నాటికి ఓటర్ల తుది జాబితా

  • బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు

  • వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • మలబద్దకానికి సహజ పరిష్కారం: ఎండుద్రాక్ష–పెరుగు కలయికతో పొట్టకు ఉపశమనం

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd