పెగాసస్‌పై మోదీకి రాహుల్ 3 ప్రశ్నలు
ఢిల్లీ - దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.
- By Hashtag U Published Date - 05:32 PM, Wed - 27 October 21

ఢిల్లీ – దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై నిజాలను నిగ్గు తేల్చడానికి ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర్య కమిటీని సుప్రీంకోర్టు వేసింది. వ్యక్తుల ప్రాథమిక హక్కును కాలరాసేలా జరుగుతోన్న ట్యాపింగ్ వ్యవహారంకు జాతీయ భద్రత అనే వాదాన్ని వినిపించడాన్ని తప్పుబట్టింది.
అయితే, తాజాగా ఈ అంశానికి సంబంధించి మూడు ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. వీటిపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
1) పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు? ఎవరు వినియోగించారు? దాన్ని ఎవరు ఆమోదించారు?
2) ఎవరెవరిపై పెగాసస్ వినియోగించి నిఘా పెట్టారు?
3) పెగాసస్ డేటా ఇంకా ఇతర దేశాల దగ్గరే ఉందా? కేవలం భారత్ దగ్గర మాత్రమే ఉందా?
पेगसस पर हमारे तीन सवाल हैं-
◆ पेगसस किसने ख़रीदा, इस्तेमाल किसने किया, किसने अधिकृत किया?
◆ पेगसस से किन लोगों की जासूसी की गई?
◆ क्या पेगसस का डाटा किसी और देश के पास भी था या सिर्फ़ हिन्दुस्तान की सरकार के पास?
: श्री @RahulGandhi#ModiSpyScandal pic.twitter.com/qWLXOrxsPg
— NSUI (@nsui) October 27, 2021
ఈ అంశాలపై ఖచ్చితంగా డిబేట్ జరగాలన్నారు రాహుల్‌గాంధీ.. బీజేపీ అందుకు అంగీకరించకపోయినా కూడా వచ్చే సమావేశాల్లో దీనిపై చర్చకు తాము పట్టుబడతామని చెప్పారు.
Related News

What happened in Rajasthan? : రాజస్థాన్ లో ఏం జరిగింది?
రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పట్ల అత్యధిక ప్రజాదరణ ఉన్నట్టు సర్వేల ద్వారా వ్యక్తం అయింది.