UPI : స్కూల్స్ లలో UPIతో ఫీజుల చెల్లింపు
UPI : UPI ద్వారా ఫీజు చెల్లింపులు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నగదు నిర్వహణ సమస్యలు తగ్గుతాయి, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా పాఠశాల ఖాతాకు డబ్బు జమవుతుంది
- By Sudheer Published Date - 11:30 AM, Sun - 12 October 25

దేశంలో డిజిటల్ లావాదేవీలకు ఊపిరి పోసిన యూపీఐ (UPI) వ్యవస్థ ఇప్పుడు విద్యారంగానికీ విస్తరించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూళ్లలో ఫీజుల వసూలు విధానం పాత పద్ధతుల్లో కొనసాగుతోంది. చాలాచోట్ల ఇప్పటికీ క్యాష్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విద్యాశాఖ ఆధునిక చెల్లింపు విధానాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, విద్యా సంస్థలకు సూచనలు పంపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు సౌలభ్యంగా, పారదర్శకంగా చెల్లింపులు చేయగలిగేలా యూపీఐ, మొబైల్ పేమెంట్స్, QR కోడ్ స్కానింగ్ వంటి మార్గాలను ఉపయోగించాలనేది కేంద్రం ఆదేశం.
Tejashwi Yadav : రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు – PK సంచలన వ్యాఖ్యలు
UPI ద్వారా ఫీజు చెల్లింపులు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. నగదు నిర్వహణ సమస్యలు తగ్గుతాయి, మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా పాఠశాల ఖాతాకు డబ్బు జమవుతుంది. విద్యార్థులు ఎక్కడి నుంచైనా మొబైల్ ద్వారా కొన్ని సెకన్లలో ఫీజు చెల్లించవచ్చు. ఈ విధానం ద్వారా చెల్లింపుల రికార్డు ఆటోమేటిక్‌గా డిజిటల్ రూపంలో నిల్వ అవుతుంది. ఫీజుల దోపిడీ, రసీదు తారుమార్లు వంటి అవకతవకలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, ఈ విధానం ద్వారా పాఠశాలల ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పెరుగుతుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), కేంద్రీయ విద్యాలయాలు (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) వంటి కేంద్ర సంస్థలకు ఈ ఆదేశాలు ఇప్పటికే పంపబడ్డాయి. రాష్ట్ర విద్యాశాఖలు కూడా తమ పరిధిలోని స్కూళ్లలో ఈ సిస్టమ్ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఫీజులు, అడ్మిషన్ చార్జీలు, ఎగ్జామ్ ఫీజులు, బస్ ఫీజులు మొదలైన వాటిని డిజిటల్ చెల్లింపుల రూపంలో స్వీకరించేలా మార్పులు చేపట్టనున్నారు. ఈ చర్యతో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ మరింత స్మార్ట్, పారదర్శకంగా, సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. ఇది భారత డిజిటల్ ఎకానమీ లక్ష్యాల దిశగా మరో ముందడుగు కానుంది.