Pawan Fire on Mamata : మమతా కు ఇచ్చిపడేసిన పవన్
Pawan Fire on Mamata : హిందుత్వం మరియు సనాతన ధర్మంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం చాలా సులభమైపోయిందని ఆయన మండిపడ్డారు
- Author : Sudheer
Date : 19-02-2025 - 10:29 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata ) మహా కుంభమేళాపై చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు. మహా కుంభమేళాను “మృత్యు కుంభ్”( ‘Mrityu Kumbh’)గా అభివర్ణిస్తూ మమత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే దీనిపై బీజేపీ పెద్దలు ఎలా స్పందించినా, మిత్రపక్ష నేతగా ఉన్న పవన్ మాత్రం కఠినంగా స్పందించారు. హిందుత్వం మరియు సనాతన ధర్మంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం చాలా సులభమైపోయిందని ఆయన మండిపడ్డారు. మహా కుంభమేళాలో పవన్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేసిన అనంతరం, జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మమతా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం సరైన పద్ధతి కాదని పవన్ స్పష్టం చేశారు.
Committee Meeting : బిఆర్ఎస్ భవన్ కు కేసీఆర్..భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం
మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద భక్తి ఉత్సవం అని, ఇలాంటి విశేష కార్యక్రమాలను నిర్వహించడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా పెద్ద సవాలుగా మారుతుందని వివరించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోందని, ప్రభుత్వ తాపత్రయాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం అనవసరమని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని అనుకోని ఘటనలు జరుగుతాయి. అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు నిర్వహించే భారీ సభల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశముంటుందని పవన్ గుర్తుచేశారు. కేవలం హిందుత్వంతో ముడిపడిన విషయాలపైనే విమర్శలు చేయడం రాజకీయ నేతల దురుసు ధోరణిని బయటపెడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
BJP : నాగబాబు రుణం తీర్చుకోబోతున్న బిజెపి..?
పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన కేవలం మమతా వ్యాఖ్యలకు స్పందించడమే కాకుండా హిందుత్వం మీద అపార్థమైన విమర్శలు చేసేవారిని ప్రశ్నిస్తూ, భావితరాలకు సరైన సందేశాన్ని ఇచ్చారు. రాజకీయంగా అనుభవం ఉన్న నాయకులు తమ మాటలకు బాధ్యత వహించాలని పవన్ స్పష్టం చేశారు. ముఖ్యంగా హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే విమర్శలకు తగిన సమాధానం చెప్పడం అవసరమని పవన్ తనదైన శైలిలో ఘాటుగా చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన హిందూ సమాజంలో మరింత పలు కోట్లు పెంచుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.