Parliament Session : 4 నుంచి పార్లమెంటు సెషన్.. ప్రవేశపెట్టనున్న 19 బిల్లులివే
Parliament Session : డిసెంబరు 4 (సోమవారం) నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
- By Pasha Published Date - 02:51 PM, Sat - 2 December 23
Parliament Session : డిసెంబరు 4 (సోమవారం) నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 22 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలు శనివారం పార్లమెంటులో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ , కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్ , గౌరవ్ గొగోయ్ , ప్రమోద్ తివారీ, తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఎన్సీపీ నేత ఫౌజియా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా డిసెంబర్ 4 నుంచి 22 మధ్యకాలంలో 15 సమావేశాలు జరుగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు
1. ద రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు – 2023 (లోక్‌సభ ఆమోదించిన విధంగా)
2. ద అడ్వకేట్స్ (సవరణ) బిల్లు – 2023 (రాజ్యసభ ఆమోదించింది)
3. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు – 2023 (రాజ్యసభ ఆమోదించింది)
4. రాజ్యాంగం (జమ్మూ కాశ్మీర్) షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ (సవరణ) బిల్లు – 2023
5. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ (సవరణ) బిల్లు – 2023
6. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు- 2023
7. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు – 2023
8. భారతీయ న్యాయ సంహిత- 2023
9. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత – 2023
10. భారతీయ సాక్ష్యా అధినియం- 2023
11. పోస్ట్ ఆఫీస్ బిల్లు- 2023
12. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, షరతులు
సర్వీస్ మరియు పదవీకాలం) బిల్లు – 2023
13. బాయిలర్స్ బిల్లు – 2023
14. తాత్కాలిక పన్నుల సేకరణ బిల్లు – 2023
15. కేంద్ర వస్తువులు, సేవల పన్ను (రెండో సవరణ) బిల్లు – 2023
16. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు – 2023
17. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు – 2023
18. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ (ప్రత్యేక నిబంధనలు) రెండో (సవరణ) బిల్లు – 2023
19. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు – 2023
పార్లమెంటు ఫైనాన్షియల్ బిజినెస్
- 2023-24 సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల కోసం సప్లిమెంటరీ డిమాండ్ల మొదటి బ్యాచ్‌పై ప్రదర్శన, చర్చ, ఓటింగ్, సంబంధిత అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలించడం, ఆమోదించడం.
- 2020-21 సంవత్సరానికి అదనపు గ్రాంట్ల కోసం డిమాండ్లపై ప్రదర్శన, చర్చ, ఓటింగ్, సంబంధిత అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టడం, పరిశీలించడం, ఆమోదించడం.
మహువా మొయిత్రా బహిష్కరణపై నివేదిక
తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారు. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిపై సోమవారం లోక్ సభలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. విచారణ కమిటీ సిఫార్సుకు మద్దతు ఇస్తూ లోక్‌సభ లో ఓటింగ్ జరిగితే.. మహువాపై బహిష్కరణ వేటుపడే అవకాశం(Parliament Session) ఉంటుంది.
Also Read: Kitchen Tips : టమాటాను ఎక్కువ కాలం నిల్వ చేసే టిప్స్
Related News
Heatwave: ఎన్నికల ప్రచారంపై ఎండల ఎఫెక్ట్..?
ఎన్నికల ప్రచారం ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటినీ పట్టి పీడిస్తున్న వేడిగాలులు రాజకీయ పార్టీల ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయి.