Parliament Session : ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్.. కీలక పథకాలపై మోడీ ప్రకటన ?
Parliament Session : సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి.
- By Pasha Published Date - 04:02 PM, Fri - 12 January 24

Parliament Session : సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏప్రిల్- మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత 17వ లోక్‌సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తుంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఈవివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు(Parliament Session) ప్రారంభమవుతాయన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ కావడంతో ఈసారి కేంద్ర ప్రభుత్వం అనేక పెద్ద ప్రకటనలు, పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే ఈ నెల 31వ తేదీన ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారు.. అతని బృందం రూపొందించిన ఈ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
Also Read: Chat GPT In Cars : ఈ కార్ల స్టీరింగ్‌లో ‘ఛాట్ జీపీటీ’ ఫీచర్.. ఇక ఎంతో కంఫర్ట్
అయితే ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మహిళా రైతులను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి మూడుసార్లు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు ఇస్తోంది. ఇది రెట్టింపు చేస్తే మహిళా రైతులకు ఏడాదికి మూడుసార్లు రూ.4 వేల చొప్పున అందిస్తే మొత్తం రూ.12 వేలు అందనున్నాయి. ఈ ప్రకటనను ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి.