Operation Sindoor : ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాక్
Operation Sindoor : మే 7న భారత రక్షణశాఖ (Ministry of Defense of India) ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది
- By Sudheer Published Date - 12:52 PM, Tue - 13 May 25

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)కు సంబంధించి పాకిస్తాన్ (Pakistan) అధికారికంగా తమ సైన్యం ప్రాణాలు విడిచిన విషయాన్నీ తెలిపింది. మొదట్లో తమ సైనికులకు ఏ విధమైన నష్టం జరగలేదని బుకాయించిన పాక్ ఇప్పుడు వాస్తవాన్ని ఒప్పుకుంది. ఆపరేషన్‌లో గాయపడిన 11 మంది సైనికులు మృతిచెందినట్లు (The soldiers are Dead) అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో ఆరుగురు ఆర్మీ, ఐదుగురు ఎయిర్ ఫోర్స్‌కు చెందినవారని తెలిపింది. ఈ విషయంపై పాక్ మీడియా కూడా తొలిసారి ఖచ్చితమైన సమాచారం వెలుగులోకి తీసుకొచ్చింది.
India Vs Kirana Hills: కిరానా హిల్స్‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్
మే 7న భారత రక్షణశాఖ (Ministry of Defense of India) ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మిస్సైల్స్‌తో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేయబడ్డాయి. భారత సైన్యం అత్యంత గోప్యతతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. మొదట ఈ దాడులపై పాక్ నిర్లిప్తంగా వ్యవహరించినా, ఇప్పుడు ఆ దాడుల్లో జరిగిన నష్టాన్ని అంగీకరించడం గమనార్హం.
పాక్ అంగీకారం తర్వాత ఈ ఆపరేషన్‌కు ఉన్న ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్ ఓసారి మళ్లీ తన భద్రతా నిబద్ధతను చూపించింది. ఇదే సమయంలో పాక్ అంతర్గతంగా తమ సైనికుల మృతికి సంబంధించి మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ వల్ల ఉగ్రవాద శక్తులకు కట్టడి, సైనిక స్థాయిలో భారత సత్తా మరోసారి ప్రపంచానికి రుజువు చేసినట్లు అయ్యింది.