HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pakistan Faces Espionage Case Another Youtuber Arrested

Pak spy : పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్‌ అరెస్టు..

జస్బీర్‌ పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్‌ జుట్ రాంధావా, అలాగే పాక్‌ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్‌ డానిష్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్‌ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్‌ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్‌ హాజరైనట్టు అధికారులు గుర్తించారు.

  • By Latha Suma Published Date - 01:28 PM, Wed - 4 June 25
  • daily-hunt
Pakistan faces espionage case.. Another YouTuber arrested..
Pakistan faces espionage case.. Another YouTuber arrested..

Pak spy : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం, భద్రతా విభాగాలు దేశంలోని గూఢచార చర్యలను అణిచివేయడంలో తీవ్రంగా నిమగ్నమయ్యాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌కు సహకరిస్తున్న నిఘా నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ యూట్యూబర్‌ జస్బీర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జస్బీర్‌ సింగ్‌ రూపనగర్‌ జిల్లాలోని మహలాన్‌ గ్రామానికి చెందినవాడు. ఇతడు ‘జాన్ మహల్‌’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను నడుపుతూ లక్షలాది మందికి సమాచారం అందిస్తూ వచ్చాడు. అతని ఛానెల్‌కు 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఇతడు పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI)కు సమాచారాన్ని అందిస్తున్నాడనే ఆరోపణలపై పోలీసులు నిఘా పెట్టి, చివరికి అరెస్టు చేశారు.

Read Also: Massive Accident : మధ్యప్రదేశ్‌ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..

పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం, జస్బీర్‌ పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్‌ జుట్ రాంధావా, అలాగే పాక్‌ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్‌ డానిష్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్‌ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్‌ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్‌ హాజరైనట్టు అధికారులు గుర్తించారు. గతంలో 2020, 2021, 2024 సంవత్సరాల్లో పాకిస్థాన్‌కు వెళ్లిన రికార్డులు వెలుగుచూశాయి. అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపగా, అనేకమంది పాకిస్థాన్‌ నంబర్లు, కమ్యూనికేషన్‌ డేటా బయటపడినట్టు సమాచారం. ఇంతకుముందు హరియాణాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఆమెతో కలిసి సమాచారం మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇక, జ్యోతి మల్హోత్రా విషయానికొస్తే, ఆమె 2023లో పాకిస్థాన్‌ వెళ్లిన సమయంలో డానిష్‌తో పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం అక్కడి గూఢచార సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఆమె ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుందన్న స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. కానీ, ఆమె ఉద్దేశపూర్వకంగా ISI అధికారులతో టచ్‌లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు పంజాబ్‌లో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాకిస్థాన్‌కు గూఢచార్యం చేసిన కేసులో అరెస్టు కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థలు ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు భారీ స్థాయిలో విచారణ చేపట్టాయి. దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఇది పెద్ద హెచ్చరికగా మారింది.

Read Also: Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ARREST
  • John Mahal YouTube Channel
  • pak 'spy'
  • punjab
  • YouTuber Jasbir Singh

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd