LoudSpeakers in Masjid : మసీదుల్లో లౌడ్ స్పీకర్లు నిలిపివేత
లౌడ్ స్పీకర్లతో మసీదుల్లో ప్రార్థన చేసే అలవాటుకు ముంబై స్వస్తి పలుకుతోంది. సుమారు ముంబైలోని 72% మసీదులు ప్రార్థన ప్రసారం కోసం లౌడ్ స్పీకర్‌ను ఉపయోగించడం మానేశాయని పోలీసు తెలిపారు.
- Author : Hashtag U
Date : 20-04-2022 - 4:24 IST
Published By : Hashtagu Telugu Desk
లౌడ్ స్పీకర్లతో మసీదుల్లో ప్రార్థన చేసే అలవాటుకు ముంబై స్వస్తి పలుకుతోంది. సుమారు ముంబైలోని 72% మసీదులు ప్రార్థన ప్రసారం కోసం లౌడ్ స్పీకర్‌ను ఉపయోగించడం మానేశాయని పోలీసు తెలిపారు. మహారాష్ట్రలోని మసీదులపై లౌడ్ స్పీకర్లను మే 3లోగా తొలగించాలని MNS చీఫ్ రాజ్ థాకరే డిమాండ్ చేయడం విదితమే. రాజకీయ వివాదం మధ్య ఈ పరిణామం జరిగింది. మొదటి ప్రార్థన ఉదయం 5 గంటలకు అందించబడుతుంది. 72% మసీదులు ఉదయం ప్రార్థనల కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం మానేయగా, ఇతర మసీదులు లౌడ్ స్పీకర్ల సౌండ్ ను తగ్గించాయని పోలీసు అధికారి పేర్కొన్నారు. వివాదం తర్వాత నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో పోలీసులు ఇటీవల మత పెద్దల సమావేశాన్ని నిర్వహించారు. లౌడ్ స్పీకర్లు పగలగొట్టారు. లౌడ్ స్పీకర్ల కోసం అనుమతులు తీసుకోవాలని, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలని పోలీసులు కోరారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అయ్యారు.