Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
- Author : Latha Suma
Date : 24-02-2024 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
క్యాంపస్‌లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్ద పేలుడు ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 9:25 గంటల ప్రాంతంలో కార్యాలయం తూర్పు వైపున గుర్తుతెలియని దుండగులు బలమైన బాంబును పేల్చినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ ఘటనలో ఓయినమ్ కెనెగి (24), సలామ్ మైఖేల్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఓయినమ్ కెనెగి ప్రాణాలు కోల్పోయినట్లు వారు వెల్లడించారు. మైఖేల్ మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
read also : TDP : కొత్తగా 23 మందికి ఛాన్స్ ఇచ్చిన టీడీపీ..