4 Months – 28 Dead Bodies : నాలుగు నెలలుగా మార్చురీలో 28 డెడ్ బాడీస్.. రేపే అంత్యక్రియలు
4 Months - 28 Dead Bodies : ఒడిశాలోని బహనాగ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2న మూడు రైళ్లు ఢీకొని చోటుచేసుకున్న ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోలేదు.
- By Pasha Published Date - 02:10 PM, Mon - 9 October 23

4 Months – 28 Dead Bodies : ఒడిశాలోని బహనాగ రైల్వే స్టేషన్ వద్ద జూన్ 2న మూడు రైళ్లు ఢీకొని చోటుచేసుకున్న ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈ ఘోర ప్రమాదంలో 291 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనలో చనిపోయిన 28 మంది డెడ్ బాడీస్ తీసుకెళ్లడానికి ఇంకా ఎవరూ రాలేదు. ఈ డెడ్ బాడీస్ లోని కొన్నింటి శరీరాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఇంకొన్ని డెడ్ బాడీస్ కు సంబంధించిన ఆధార్ ఐడీ లేదా ఓటరు ఐడీ లేదా సెల్ ఫోన్ వంటివి లభించలేదు. దీంతో వారి అడ్రస్ లను అధికారులు ట్రాక్ చేయలేకపోయారు. ఆధార్ కార్డులను నమోదు చేసే క్రమంలో ఐరిస్, వేలిముద్రలను తీసుకుంటారు. కనీసం వాటి ఆధారంగా కూడా.. ఆ గుర్తు తెలియని డెడ్ బాడీస్ కు సంబంధించిన అడ్రస్ లను దొరకపట్టలేకపోయారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం ఈ గుర్తు తెలియని 28 డెడ్ బాడీస్.. ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిమ్స్ మార్చురీలో డీప్ ఫ్రీజర్ కంటైనర్లలో ఉన్నాయి. వాటి కోసం ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. దీంతో వాటికి అధికారులే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీబీఐ అధికారుల సమక్షంలో ఆ మృతదేహాలను భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగిస్తామని.. వాటికి రేపు (మంగళవారం రోజు) అంత్యక్రియలు నిర్వహిస్తామని భువనేశ్వర్ మేయర్ సులోచన దాస్ ప్రకటించారు.ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తామని (4 Months – 28 Dead Bodies) చెప్పారు.