PF Withdrawal : ఇకపై సెకన్ల లలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే !!
PF Withdrawal : జూన్ 2025 నుంచి అమల్లోకి రానున్న EPFO 3.0 ద్వారా పీఎఫ్ ఉపసంహరణ చాలా సులభంగా, వేగంగా, డిజిటల్ రీతిలో పూర్తవుతుంది
- By Sudheer Published Date - 01:13 PM, Fri - 30 May 25
ఇప్పటి వరకు పీఎఫ్ విత్ డ్రా(Withdraw) కోసం ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేసాక కనీసం వారం రోజుల సమయం వేచి ఉండాల్సి వచ్చేది. పేరులో తేడా, బ్యాంకు డిటెయిల్స్ లో తప్పులు ఉంటే రిజెక్షన్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉండేది. అయితే ఇక అలాంటి సమస్యలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2025 నుంచి అమల్లోకి రానున్న EPFO 3.0 ద్వారా పీఎఫ్ ఉపసంహరణ చాలా సులభంగా, వేగంగా, డిజిటల్ రీతిలో పూర్తవుతుంది.
EPFO 3.0 ద్వారా యూజర్లు యూపీఐ యాప్స్ (ఫోన్ పే, గూగుల్ పే, భీమ్) ద్వారా రూ. లక్ష వరకు తమ పీఎఫ్ డబ్బులను తక్షణమే బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే వెసులుబాటు పొందుతారు. అంతేకాదు ప్రత్యేక విత్‌డ్రాయల్ కార్డ్ ద్వారా ఏటీఎం నుంచి కూడా నగదు ఉపసంహరణ సాధ్యమవుతుంది. యూజర్ యూఏఎన్ (UAN), ఓటీపీ ఆధారంగా సెక్యూరిటీతో కూడిన ఈ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా అమలవుతుంది. ఇకపై ఆన్‌లైన్ క్లెయిమ్, ఫీల్డ్ ఆఫీస్ ఆమోదం వంటి అడ్డంకులు లేకుండా 24 గంటల విత్‌డ్రా సదుపాయం లభిస్తుంది.
Whatsapp Logout Feature : వాట్సాప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తుంది
ఈ కొత్త విధానం కేవలం వైద్య అత్యవసరాలు, ఇల్లు, వివాహ ఖర్చులు వంటి కొన్ని అవసరాలకే కాకుండా సహజ విపత్తులు, ఇతర ఆర్థిక అవసరాలకూ విస్తరించనుంది. EPFO సభ్యులు తమ KYC వివరాలు (ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా) అప్‌డేట్ చేయాలి. UANను యూపీఐ ఐడీతో లింక్ చేయాలి. ఏటీఎం కార్డ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌లను గమనిస్తూ ఉండాలి. మొత్తంగా, EPFO 3.0 ద్వారా పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ మరింత సులభం, వేగవంతం, వినియోగదారులకు అనుకూలంగా మారనుంది.