Budget : ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు
- Author : Sudheer
Date : 01-02-2024 - 8:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అరుదైన రికార్డు (Record) సాధించింది. మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కాగా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పబోతున్నారు. ఇప్పటికే ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశ పెట్టగా..ఈరోజు ( ఫిబ్రవరి 1న ) ప్రవేశ పెట్టె బడ్జెట్‌తో ఆరోసారి కానుంది. ఇప్పటివరకు ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో అరుణ్‌జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్ సింగ్ లు ఉండగా..ఇక ఇప్పుడు నిర్మలా ఆరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు నెలకొల్పోతున్నారు. కాకపోతే 1959-64 మధ్య మొరార్జీ దేశాయ్ మొత్తం ఐదు పూర్తిస్థాయి, ఒక మధ్యంతర బడ్జెట్ సమర్పించి నిర్మల కంటే ముందున్నారు.
ఇక ఈసారి ఎన్నికల ఏడాది ప్రవేశపెట్టేది కావడంతో దీనిని మద్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ అంటారు. ఇది కేవలం మూడు నెలలకే ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది. దేశంలో ఇప్పటివరకూ 77 పూర్తి స్థాయి బడ్జెట్‌లు, 14 తాత్కాలిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. స్వతంత్ర్య భారతదేశపు తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు.
Read Also : First Budget in India : ఇండియాలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా..?