Nepal Earthquake : నేపాల్ భూకంపం ఘటనలో గంట గంటకు పెరుతున్న మృతుల సంఖ్య
మొదటి 50 , 100 లోపే అనుకున్నప్పటికీ..ప్రస్తుతం మృతుల సంఖ్య 132 కు చేరింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
- By Sudheer Published Date - 12:39 PM, Sat - 4 November 23

నేపాల్ భూకంప ఘటన (Nepal Earthquake) లో గంట గంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదటి 50 , 100 లోపే అనుకున్నప్పటికీ..ప్రస్తుతం మృతుల సంఖ్య 132 (132 Kills)కు చేరింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. నేపాల్ (Nepal )లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించింది. నేపాల్‌కు వాయవ్యంగా జుమ్లా ప్రాంతానికి 42 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్ర నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో ఢిల్లీ ఎన్సీఆర్, యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, హర్యానా ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
భూకంపం కారణంగా నేపాల్‌లో పెద్దఎత్తున భవనాలు నేలకూలాయి. అర్ఱరాత్రి సమయం కావడంతో చాలా మంది ఆ సమయంలో నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువ అవుతుంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో అప్పటికే చాలామంది రోడ్లపైకి చేరుకున్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున భవనాలు కూలడంతో ఆ శిధిలాల కింద చాలామంది చిక్కుకొని , ప్రాణాలు విడివగా..మరికొంతమంది తీవ్ర గాయాలపాలై ..హాస్పటల్స్ లలో చికిత్స తీసుకుంటున్నారు. భూకంపంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Read Also : Wine Shops : మందుబాబులు జాగ్రత్తపడండి..మూడు రోజులు వైన్ షాప్స్ బంద్