Draupadi Murmu : సింప్లీ ద్రౌపది
వెరీ సింపుల్ గా ఉంటారు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఆమె సామాన్య మహిళ మాదిరిగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- By CS Rao Updated On - 02:45 PM, Wed - 22 June 22

వెరీ సింపుల్ గా ఉంటారు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఆమె సామాన్య మహిళ మాదిరిగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీరుపు చేతబట్టి ఆమె నియోజకవర్గంలోని ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆమె శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా కీలక పదవులను చేపట్టిన ఆమె తాజాగా దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి రేసులో నిలిచారు. అయినా మూలాలను మరవని ముర్ము సొంతూళ్లోని శివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ గడిపారు.
ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన రాయ్ రంగాపూర్ నియోజకవర్గం నుంచే ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆ ఆలయంలో ఆమె పూజలు చేస్తున్నారు. తాజాగా ఎన్ని పదవులు చేపట్టినా ఆ హోదాల్ని పక్కన పెట్టి, ఆమె ఈ తరహాలో తన భక్తిభావాన్ని చాటుకోవడం విశేషం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ద్రౌపది ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తనకు దక్కిన ఈ అవకాశానికి ఏమాత్రం పొంగిపోకుండా బుధవారం నేరుగా తన సొంత నియోజకకవర్గం రాయ్‌రంగాపూర్‌లోని శివాలయంలో ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు.
ఆమె రాష్ట్రపతి అభ్యర్థి.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి, పదవిని చేపట్టడమూ ఖాయం.. అయినా ఆమె నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచారు… ఆమె బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.
1/2 pic.twitter.com/USIw8A3mLV— BJP Telangana (@BJP4Telangana) June 22, 2022
Related News

PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అంటూ పలికారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశిస్తూ మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ హైదరాబాద్ ను భాగ్యనగర్ అని అన్నారు.