National Herald case: మూడో రోజూ ఈడీ ముందుకు!
నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజైన బుధవారం
- By Balu J Published Date - 01:21 PM, Wed - 15 June 22

నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజైన బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈడీ విచారణకు నిరసనగా ఢిల్లీలో వందలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు.కాంగ్రెస్ కార్యకర్తల నిరసనల పర్వంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతా బలగాలను మోహరించి 144 సెక్షన్ విధించారు.రాహుల్ గాంధీపై ఈడీ చర్య పాలకవ్యవస్థకు నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, మల్లికార్జున్ ఖర్గే, రణదీప్ సూర్జేవాలా వంటి కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పారు. రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతూ రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్‌ను షేర్ చేశారు.ఢిల్లీ పోలీసులు ఏఐసీసీ కార్యాలయంలోకి నేతల ప్రవేశించడాన్ని నిషేధించడంపై సీఎం బఘేల్ ఆందోళన వ్యక్తం చేశారు.నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు..