Cabinet Ministers List: మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు వీరే..!?
- Author : Gopichand
Date : 09-06-2024 - 8:47 IST
Published By : Hashtagu Telugu Desk
Cabinet Ministers List: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అద్భుతమైన ఈ వేడుకలో నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీతో పాటు దాదాపు 40 మంది ఎంపీలు కూడా మంత్రులు (Cabinet Ministers List)గా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఈ 40 మంది ఎంపీల్లో ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలు కూడా ఉండవచ్చని సమాచారం. వీరికి మంత్రి పదవులు కట్టబెట్టడంపై భారీ చర్చ జరుగుతోంది.
టీడీపీ-జేడీయూ నుంచి మొత్తం నలుగురు ఎంపీలను కేబినెట్ మంత్రులుగా చేయనున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీకి కేబినెట్ మంత్రి పదవి ఇవ్వవచ్చు. శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, సీషెల్స్, మారిషస్, నేపాల్, భూటాన్ 7 దేశాల అధినేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అదే సమయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పాల్గొనదు. పార్టీ తరపున జైరాం రమేష్ ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. అయితే మోదీ కేబినెట్‌లో ఆయా పార్టీ నుంచి కొందరు ఎంపీలకు మంత్రి పదవి దక్కిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూద్దాం.
బీహార్‌కు చెందిన ఈ ఎంపీలను మంత్రులుగా చేసుకోవచ్చు
జితన్ రామ్ మాంఝీ (HAM), లాలన్ సింగ్ (JDU), సునీల్ కుమార్ (JDU), కౌశలేంద్ర కుమార్ (JDU), రామ్‌నాథ్ ఠాకూర్ (JDU), సంజయ్ ఝా (JDU), జితిన్ ప్రసాద్ (BJP), రాజీవ్ ప్రతాప్ రూడీ (BJP), సంజయ్ జైస్వాల్ (బిజెపి), నిత్యానంద రాయ్ (బిజెపి), చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జెపి)లకు మంత్రులుగా అవకాశం దక్కనుందని సమాచారం.
Also Read: T20 World Cup: నేడు భారత్- పాకిస్థాన్ మ్యాచ్.. పాక్ జట్టులోకి కీలక ఆటగాడు, గెలుపెవరిదో..?
మోదీ కేబినెట్‌లో యూపీ ఎంపీలు
రాజ్‌నాథ్ సింగ్ (బిజెపి), అనుప్రియా పటేల్ (మీర్జాపూర్ నుండి అప్నా దళ్ చీఫ్), జయంత్ చౌదరి (రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్)లకు చోటు దక్కనుంది.
కర్ణాటకకు చెందిన ఎంపీలు
హెచ్‌డి కుమారస్వామి (జెడిఎస్), ప్రహ్లాద్ జోషి (బిజెపి), బసవరాజ్ బొమ్మై (బిజెపి), గోవింద్ కార్జోల్ (బిజెపి), పిసి మోహన్ (బిజెపి)లకు చోటు దక్కే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp : Click to Join
మహారాష్ట్రకు ఎంపీలు
ప్రతాపరావు జాదవ్ (బిజెపి), నితిన్ గడ్కరీ (బిజెపి), పియూష్ గోయల్ (బిజెపి)లకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమంటున్నారు.
మధ్యప్రదేశ్ ఎంపీలు
జ్యోతిరాదిత్య సింధియా (బిజెపి), శివరాజ్ సింగ్ చౌహాన్ (బిజెపి) మంత్రులు కానున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్‌లో తెలంగాణ ముఖాలు
కిషన్ రెడ్డి (బిజెపి), ఈటల రాజేందర్ (బిజెపి), డికె అరుణ (బిజెపి), డి అరవింద్ (బిజెపి), బండి సంజయ్ (బిజెపి)లకు కేబినెట్‌లో అవకాశం కల్పించినట్లు సమాచారం.
ఏపీ ఎంపీలు
దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ), కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ)కు కేంద్ర కేటినెట్‌లో మంత్రిగా అవకాశం దక్కనున్నట్లు సమాచారం.