Bulldozers Action : నాగ్‌పూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
మార్చి 17న నాగ్‌పూర్‌లో(Bulldozers Action) అల్లర్లు జరిగాయి. మార్చి 20న నాగ్‌పూర్ మున్సిపాలిటీలోని ఆశీ నగర్ జోన్‌కు చెందిన అధికారులు ఫహీం ఇంటిని తనిఖీ చేశారు.
- Author : Pasha
Date : 24-03-2025 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
Bulldozers Action : బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో ఇటీవలే చెలరేగిన హింస కేసులో కీలక నిందితుడిగా ఫహీమ్‌ఖాన్ ఉన్నాడు. ఈ అల్లర్లకు అతడే మాస్టర్ మైండ్ అని పోలీసులు అభియోగాలను నమోదు చేశారు. తాజాగా ఇవాళ(సోమవారం) నాగ్‌పూర్‌లోని సంజయ్ బాఘ్ కాలనీలో ఉన్న ఫహీం ఖాన్ ఇంటిని నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేయించారు. బుల్డోజర్లతో ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. ఆ ఇంటిని అక్రమంగా నిర్మించారని అధికారులు ఆరోపించారు. మున్సిపాలిటీకి చెందిన ఆక్రమణల వ్యతిరేక స్క్వాడ్ ఈ కూల్చివేత ప్రక్రియను నిర్వహించింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ రెండు బుల్డోజర్లతో ఈ ప్రక్రియ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఫహీమ్ ఇంటిని నేలమట్టం చేశారు.
Also Read :Tiger And Trump: డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలితో టైగర్ ప్రేమాయణం
మార్చి 17న నాగ్‌పూర్‌లో(Bulldozers Action) అల్లర్లు జరిగాయి. మార్చి 20న నాగ్‌పూర్ మున్సిపాలిటీలోని ఆశీ నగర్ జోన్‌కు చెందిన అధికారులు ఫహీం ఇంటిని తనిఖీ చేశారు. దాని కొలతలను సేకరించారు. అది అక్రమ నిర్మాణమని తేల్చారు. ఇంటిని కూల్చేస్తామని మార్చి 21న ఫహీం కుటుంబానికి నోటీసులను అందజేశారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వమని సూచించారు. అయితే ఫహీం కుటుంబం వైపు నుంచి ఎవరూ వచ్చి వివరణ ఇవ్వలేదు. దీంతో 86.48 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న ఫహీం ఖాన్ ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు.
Also Read :Hanmanthraopet Old Houses : మీరు అలాంటి కట్టడాలు చూడాలంటే హన్మంతరావుపేట కు వెళ్లాల్సిందే
కూల్చేసిన ఈ ఇల్లు ఫహీం భార్య జహీరున్నిసా షమీమ్ ఖాన్ పేరుపై ఉందని అధికారులు గుర్తించారు. 1966 మహారాష్ట్ర ప్రాంతీయ పట్టణ ప్రణాళికా చట్టాన్ని ఉల్లంఘించిన ఆ ఇంటిని ఫహీం నిర్మించుకున్నట్లు అధికారులు తేల్చారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు స్టైల్‌లో మహారాష్ట్రలోనూ చర్యలు మొదలుపెడతామని ఇటీవలే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఇవాళ యాక్షన్ జరిగింది. మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) నేతగా ఫహీం ఖాన్ వ్యవహరిస్తున్నారు.