Modi’s Teacher : పాఠాలు చెప్పిన గురువును కలిసి ప్రధాని మోదీ…!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. నవ్ సారి ప్రాంతంలోని వాద్ నగర్ వెళ్లిన మోదీ...తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన తన గురువును కలిసారు.
- By Bhoomi Updated On - 08:15 PM, Fri - 10 June 22

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. నవ్ సారి ప్రాంతంలోని వాద్ నగర్ వెళ్లిన మోదీ…తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన తన గురువును కలిసారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తన గురువు యోగక్షేమాలను ఆరా తీశారు. మోదీని చూడగానే ఆ గురువులో ఆప్యాయత, ఆనందం ఉప్పొంగింది. తన శిష్యుడు…దేశ ప్రధాని అయ్యాడన్న సంతోషం ఆయనలో వెల్లివిరిసింది. మోదీని ఆప్యాయంగా ఆలింగం చేసుకున్నారు. ఆనంద బాష్యాలు రాల్చారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నెటిజన్లు ఆ ఫొటోను చూసి కామెంట్లు చేస్తున్నారు.
Related News

International Yoga Day : మైసూర్ యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ…!!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం కర్నాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.