Modi Degree : మోడీ సర్టిఫికేట్లకు మకిలి, విపక్షాల రాద్ధాంతం!
మోడీ విద్యాభ్యాసం(Modi degree).సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరంలేదని
- By CS Rao Published Date - 03:05 PM, Sat - 1 April 23

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యాభ్యాసం(Modi degree) రాజకీయంగా మారింది. ఆయన డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరంలేదని గుజరాత్ హైకోర్టు (Gujarat high court)చెప్పినప్పటికీ ప్రత్యర్థి పార్టీలు వాటిని అడుగుతున్నారు. అంతేకాదు, పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీల్లో చదువుకున్నట్టు ఆధారాలు లేవని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నారు. ఒక వేళ ఉంటే, బయట పెట్టాలని కోరుతున్నారు. ఆయన సర్టిఫికేట్లు నకిలీ అయినా ఉండాలి? లేదా మోడీ అహంకారపూరితగా విద్యాభ్యాసాన్ని చెప్పడంలేదని ధ్వజమెత్తారు.
నరేంద్ర మోడీ విద్యాభ్యాసం రాజకీయం (Modi degree)
ప్రధాన మంత్రి అయిన కొద్దికాలానికి మోడీ విద్యాభ్యాసంపై (Modi degree) అప్పట్లో చర్చ జరిగింది. పార్లమెంట్ లోనూ ఇదే అంశాన్ని ప్రశ్న రూపంలో ప్రత్యర్థులు సంధించారు. డిగ్రీ, పీజీ చదువుకున్నట్టు ఆధారాలు చూపాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ అప్పట్లో సవాల్ చేశారు. అంతేకాదు, ఆయన గుజరాత్ యూనివర్సిటీని కోరారు. కేంద్ర సమాచారశాఖ ఉత్తర్వులను శుక్రవారం గుజరాత్ కోర్టు కొట్టివేసింది. ఆ తీర్పుపై కేజ్రీ అభ్యంతరం పెడుతున్నారు. ఉత్తర్వుపై గుజరాత్ విశ్వవిద్యాలయం(Gujarat high court) అప్పీల్‌ను అనుమతిస్తూ, జస్టిస్ బిరెన్ వైష్ణవ్ కూడా కేజ్రీవాల్‌కు రూ. 25,000 జరిమానా విధించారు ఆ మొత్తాన్ని గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కి నాలుగు వారాల్లోగా జమ చేయాలని కోరారు. దీంతో `హైకోర్టు ఆదేశాలతో దేశం మొత్తం ఉలిక్కిపడింది, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమాచారం కోరే మరియు ప్రశ్నలు అడిగే స్వేచ్ఛ ఉండాలి, ”అని కేజ్రీవాల్ మీడియా ముందు ప్రశ్నించారు.
Also Read : Tamannaah and Rashmika in Modi Ilaka: మోదీ ఇలాకాలో తెలుగు పాట హవా.. స్టెప్పులతో అదరగొట్టిన తమన్నా, రష్మిక
సాధారణంగా ప్రత్యర్థులు ఇలాంటి అనుమానాలను వ్యక్తపరిస్తే, వెంటనే క్లారిఫై చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తోంది. కనీసం మీడియాముఖంగానైనా స్పందిస్తుంది. కానీ, మోడీ సర్టిఫికేట్ల విషయంలో బీజేపీ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. దీంతో ఆయన విద్యాభ్యాసంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని విద్యార్హతపై సమాచారం ఇవ్వడానికి గుజరాత్ విశ్వవిద్యాలయం సిద్ధంగా లేదు. దీనికి కారణం `మోదీ అహంకారం వల్లనో, లేదా ఆయన డిగ్రీ నకిలీదని` కేజ్రీవాల్ అన్నారు.అయినప్పటికీ, దేశంలో చాలా పేదరికం ఉన్నందున నిరక్షరాస్యులుగా ఉండటం “నేరం లేదా పాపం” కాదని ఆయన జోడించారు. “కుటుంబాలలో ఆర్థిక పరిస్థితుల కారణంగా మనలో చాలామంది అధికారిక విద్యను పొందే స్థితిలో లేము` అంటూ చురకలు వేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి పేదరికం దేశాన్ని పీడిస్తూనే ఉందని కేజ్రీ అన్నారు. మోడీ విద్యాభ్యాసంపై(Modi degree) కేజ్రీవాల్ తన ప్రశ్నను కొనసాగించారు. దేశం ప్రధాని అయినప్పటి నుండి మోడీ ప్రతిరోజు సైన్స్ మరియు ఎకానమీకి సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.
ప్రధాని మోదీకి విద్యాబుద్ధులు ఉంటే నోట్ల రద్దు
“ప్రధానమంత్రికి చదువు రాకపోతే, అధికారులు మరియు వివిధ రకాల వ్యక్తులు వచ్చి ఎక్కడైనా ఆయన సంతకం తీసుకుంటారు. అతని నుండి నోట్ బ్యాన్ (డిమోనిటైజేషన్) వంటి ఏదైనా పాస్ చేస్తారు, దీని వల్ల దేశం చాలా నష్టపోయింది,” అని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి విద్యాబుద్ధులు ఉంటే నోట్ల రద్దును అమలు చేసి ఉండేవారు కాదు’ అని కేజ్రీ విమర్శించారు. మొత్తం మీద గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా మోడీ సర్టిఫికేట్ల(Gugarat high court) గురించి పెద్ద రాద్ధాంతం జరుగుతోంది.