cabinet expansion: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ..?
కొత్త ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఉండడంతో బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర కేబినెట్ విస్తరణ (cabinet expansion) చేయబోతోంది. నిజానికి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ సారి కేబినెట్ విస్తరణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడనుంది.
- By Gopichand Published Date - 07:20 AM, Sun - 1 January 23

కొత్త ఏడాదిలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఉండడంతో బీజేపీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా కేంద్ర కేబినెట్ విస్తరణ (cabinet expansion) చేయబోతోంది. నిజానికి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా తమ తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ సారి కేబినెట్ విస్తరణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడనుంది. ఈ విస్తరణతో ఎక్కువ రాజకీయ లబ్ది పొందాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఒకరు లేదా ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక కేబినెట్ నుంచి కీలక వ్యక్తులను తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే వచ్చే ఎన్నికలు జరిగే సమయానికి ముందు కేబినెట్ విస్తరణ ఇదే చివరిది కానుంది. 2023లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తదితర 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మంత్రుల పనితీరును బట్టే కాకుండా.. అర్హులైన ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించడానికి సన్నద్ధమవితోంది.
Also Read: Earthquake: కొత్త సంవత్సరం రోజున కంపించిన భూమి
రాజస్తాన్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ ల నుంచి కొందరికి మంత్రులుగా అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించవచ్చు. తెలంగాణ, కర్నాటక, త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్తాన్ ల్లో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, చత్తీస్ గఢ్ ల్లో విజయం సాధించడం లేదా, మెరుగైన ఫలితాలను సాధించాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉంది.
అలాగే మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన వారిని పార్టీ సేవలకు ఉపయోగించుకునేలా ప్లాన్స్ సిద్దం చేసింది.ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం జనవరి 20తో ముగుస్తుంది. జనవరి నెలలోనే పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారనీ అంచనా వేస్తున్నారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు కీలక నేతలను కూడా మార్చేందుకు మోడీ వెనుకాడ లేదు. దీంతో సంక్రాంతి తర్వాత జరిగే విస్తరణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.